IPL 2025: గుజరాత్ టీమ్‌కు షాక్! స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి అవుట్

Published : Apr 12, 2025, 05:35 PM IST

IPL 2025 Glenn Phillips : హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) స్టార్ ప్లేయ‌ర్ గ్లెన్ ఫిలిఫ్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయ‌ప‌డ్డాడు.  గజ్జల్లో గాయం తీవ్రత ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇప్పుడు అత‌ను పూర్తిగా ఐపీఎల్ 2025కి దూరం అయ్యాడు. 5 మ్యాచ్ లు ఆడి 4 విజ‌యాల‌తో ఐపీఎల్ 2025 పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

PREV
14
IPL 2025: గుజరాత్ టీమ్‌కు షాక్! స్టార్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి అవుట్

Glenn Phillips IPL 2025: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. జీటీ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి పూర్తిగా అవుట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన గుజరాత్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోంది.

ఇలాంటి సమయంలో గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో అటాకింగ్ ప్లేయర్, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గజ్జలో గాయం అయింది. గాయం తీవ్రత కారణంగా గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. 

24
Glenn Phillips ruled out of the IPL due to injury

గ్లెన్ ఫిలిఫ్స్ గుజరాత్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదవ ఓవర్ తర్వాత  సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆ ఓవర్‌లోని నాల్గవ బంతిని అతను ఫీల్డింగ్ చేసి విసిరినప్పుడు, అతను వెంటనే తన నడుమును పట్టుకుని బాధతో కింద పడిపోయాడు.

34
Image Credit: Getty Images

జట్టు ఫిజియో వెంటనే వచ్చి చెక్ చేశాడు. గాయం తీవ్రత కారణంగా గ్లెన్ ఫిలిప్స్ గ్రౌండ్ ను వీడాడు. సీజన్ ముగిసే లోపు అతని గాయం తగ్గే అవకాశాలు లేకపోవడంతో అతను ఐపీఎల్ 2025కి పూర్తిగా దూరం అయ్యాడని టీమ్ పేర్కొంది. గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటున్నారనేది ఇంకా ప్రకటించలేదు.

న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు, అద్భుతమైన బౌలర్. అలాగే, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 

44

Glenn Phillips

అతను లేకపోవడం గుజరాత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. గుజరాత్ జట్టు ఫాస్ట్ బౌలర్ కాసికో రబాడ వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే స్వదేశానికి వెళ్లాడు. అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడనే దానిపై కూడా స్పష్టత లేదు. 

ఈ సీజన్ కోసం గుజరాత్ జట్టు కేవలం 7 మంది విదేశీ ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు జోస్ బట్లర్, రషీద్ ఖాన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ మాత్రమే అన్ని మ్యాచ్‌లలోనూ ఆడుతున్నారు. గుజరాత్ జట్టులో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ కరీం జనత్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోట్జీ కూడా ఉన్నారు. కోయెట్జీ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories