డిసెంబర్‌లో వేలం.. నవంబర్ 15 వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయండి.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశం

Published : Oct 17, 2022, 04:56 PM IST

IPL 2023 Auction: ఐపీఎల్ -2023 కోసం మినీ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే వేలం ప్రక్రియ కంట  ముందే ఫ్రాంచైజీలు మరో  పని చేయాలని  బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు సమాచారమివ్వనుంది.  

PREV
15
డిసెంబర్‌లో వేలం.. నవంబర్ 15 వరకు ఆ ప్రక్రియ పూర్తి చేయండి.. ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశం

2019 తర్వాత మళ్లీ ఇంటా బయటా (హోమ్ అండ్ అవే) పద్ధతిలో జరుగనున్న  ఐపీఎల్ -2023 సీజన్ కోసం  బీసీసీఐ సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది డిసెంబర్ 16న ఐపీఎల్  వేలం నిర్వహించనున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ ను తమకు అందజేయాలని  సూచించనుంది. 

25

వచ్చే నెల 15 వరకు  అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టు తరఫున  ఉండే ఆటగాళ్లు ఎవరు..?  వేలంలో వదిలేయబోయే క్రికెటర్లు ఎవరు..? అనేదానిపై తమకు నవంబర్ 15లోగా సమాచారం అందించాలని  పది ఫ్రాంచైజీలను కోరనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి  త్వరలో జరిగే ఏజీఎం సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

35

ఈ సీజన్ లో పర్స్ వాల్యూను రూ. 90 నుంచి రూ. 95 కోట్లకు  పెంచినా ఇది గత ఫిబ్రవరిలో జరిగేంత మెగా వేలం కాదు. తమ కోర్ టీమ్ (ప్రధాన జట్టు) ను అలాగే ఉంచి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే  చేసుకునేందుకు వీలుగా ఇది ఉపయోగపడుతుంది. 

45

తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, గతేడాది  వేలంలో ముగియగా మిగిలిన పర్స్ విలువ,  తదితర వివరాలకు సంబంధించిన విషయాలన్నీ ఫ్రాంచైజీలు వచ్చే  నెల 15 వరకు బీసీసీఐ కి అందజేయాల్సి ఉంటుంది. ఆ మేరకు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టాయి.

55

ఈసారి వేలంలో సామ్ కరన్ (ఇంగ్లాండ్) కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా) తో పాటు టీ20  ప్రపంచకప్ లో మెరువబోయే ఆటగాళ్లు భారీ గిరాకి ఉండనుంది. భారత్ లో ప్రస్తుతం జరుగుతున్న సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించబోయే కుర్రాళ్ల మీద ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. 

click me!

Recommended Stories