pakistan
నెదర్లాండ్స్ జట్టు, సౌతాఫ్రికాని చిత్తు చేయడంతో లక్కీగా సెమీ ఫైనల్‌కి దూసుకొచ్చింది పాకిస్తాన్ జట్టు. గ్రూప్ స్టేజీ నుంచి ఇంటికి వెళ్లాల్సిన పాక్, మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని చిత్తు చేసి... ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్‌లో గెలిస్తే టీమిండియా ఫైనల్ చేరుతుంది...
India vs Pakistan
గ్రూప్ స్టేజీలో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కి బీభత్సమైన క్రేజ్ వచ్చింది. స్టేడియంలో 92 వేల మందికి పైగా ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ని తిలకించగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రియల్ టైం వ్యూస్ రికార్డు స్థాయిలో 18 మిలియన్లను దాటేశాయి...
Rohit Sharma
బ్రాడ్ కాస్టర్లకు లాభాల పంట పండించింది ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్. ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి దాయాదుల తలబడితే మునుపటి రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. అయితే టీమిండియా ఫ్యాన్స్‌ని భయపెడుతున్న విషయం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2021 టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్...
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది టీమిండియా. ఇప్పటికీ ఈ మ్యాచ్‌ని మరిచిపోవాలని భారత క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగా అనుకుంటున్నా, అదో పీడకలలా గుర్తుకు వస్తూనే ఉంది. ఈ పరాభవం తర్వాత నాలుగేళ్లకు మరో దెబ్బ తగిలింది.
Image credit: PTI
2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ చేతుల్లో ఎదురైన మొదటి పరాభవం ఇదే. ఆ తర్వాత ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 స్టేజీలోనూ ఇదే రకమైన అనుభవం ఎదురైంది...
గత ఏడాది కాలంలో ఇండియా - పాకిస్తాన్ మధ్య నాలుగు మ్యాచులు జరిగితే రెండింట్లో పాక్, రెండింట్లో భారత జట్టు గెలిచాయి. ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలబడితే ఆ హోరాహోరీ ఫైట్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. అయితే ఈసారి పాక్ చేతుల్లో టీమిండియా ఓడితే మాత్రం తట్టుకోవడం కాస్త కష్టమే.
Image credit: PTI
అందుకే టీమిండియా ఓడిపోతే ఇంగ్లాండ్‌తో జరిగే సెమీ ఫైనల్‌లోనే ఓడిపోయి ఇంటికి రావాలని... ఫైనల్‌కి వెళ్లి పాకిస్తాన్ చేతుల్లో మాత్రం ఓడిపోవద్దని వేడుకుంటున్నారు అభిమానులు. ఇంగ్లాండ్ చేతుల్లో ఓడినా కాస్త పరువు నిలుస్తుందని, పాక్ చేతుల్లో ఓడిపోతే పొరుగు దేశం వాళ్లు చేసే అతి తట్టుకోవడం చాలా కష్టమని పోస్టులు చేస్తున్నారు...
ఎప్పుడూ టీమిండియా గెలవాలని కోరుకునే భారత అభిమానులు,ఈసారి మాత్రం గెలిస్తే రెండూ గెలవాలని... లేదంటే సెమీ ఫైనల్‌లోనే ఓడిపోవాలని కోరుకోవడం విశేషం. పాక్‌తో మ్యాచ్ విషయానికి అనేసరికి గెలుపు కంటే పరువుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం విశేషం..