CSK vs RCB: కోహ్లీ-ధోని మ‌ధ్య బిగ్ ఫైట్.. చెపాక్‌లో ఆర్సీబీ చ‌రిత్ర సృష్టిస్తుందా?

Published : Mar 28, 2025, 06:12 PM IST

IPL 2025, CSK vs RCB: ఐపీఎల్ 2025 8వ మ్యాచ్ లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బిగ్ ఫైట్ కు సిద్ధమయ్యాయి. కోహ్లీ-ధోనిలలో గెలిచేది ఎవరు? 

PREV
15
CSK vs RCB: కోహ్లీ-ధోని మ‌ధ్య బిగ్ ఫైట్.. చెపాక్‌లో  ఆర్సీబీ చ‌రిత్ర సృష్టిస్తుందా?

IPL 2025, CSK vs RCB: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో మ‌రో బిగ్ ఫైట్ జ‌రుగుతోంది. ఐపీఎల్ 2025లో8వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జ‌ట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ సీజ‌న్ లో రెండు జ‌ట్లు త‌మ‌ తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత ఇక్క‌డ బిగ్ ఫైట్ చేస్తున్నాయి. ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. చెన్నై జట్టు ముంబై ఇండియన్స్ పై తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది.

25
IPL  CSK vs RCB: Big fight between Virat Kohli and MS Dhoni.. Will RCB create history in Chepauk?

ధోని-కోహ్లీ బిగ్ ఫైట్.. గెలిచేది ఎవ‌రు? 

విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన యుద్ధం జరగనుంది. IPL 2025 లో ఇప్పటివరకు అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ, చెన్నై పిచ్ బ్యాట్స్‌మెన్‌కు నిజంగా పరీక్ష లాంటిది. ఎందుకంటే, ఇక్కడ బంతి బ్యాట్‌పై బిగ్ షాట్లు ఆడే విధంగా రాదు.

బ్యాట్స్‌మెన్ షాట్లు ఆడటం అంత సులభం కాదు. అలాగే, ఇక్కడ చెన్నై జట్టును ఎప్పుడూ బలమైన జట్టుగా పరిగణిస్తారు. ఈ మ్యాచ్ లో మ‌రో ముఖ్యమైన విష‌యం ఇక్కడ టాస్ కూడా కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈ బిగ్ ఫైట్ లో ధోని-కోహ్లీల‌లో ఎవ‌రు గెలుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. 

35
IPL  CSK vs RCB: Big fight between Virat Kohli and MS Dhoni.. Will RCB create history in Chepauk?

చెన్నై పిచ్ పై ఆడ‌టం అంత సుల‌భం కాదు ! 

చెన్నై గ్రౌండ్ లో జరిగిన చివరి మ్యాచ్‌లో సీఎస్కే ముంబై ఇండియన్స్‌తో త‌ల‌ప‌డింది. CSK కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై జట్టు మొత్తం 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించిన CSK ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే విజ‌యం సాధించింది. ఇప్పుడు జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ-సీఎస్కే ల‌లో టాస్ గెలిచిన జట్టు లక్ష్యాన్ని ఛేదించాలని వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉండ‌వ‌చ్చు. 

45
IPL  CSK vs RCB: Big fight between Virat Kohli and MS Dhoni.. Will RCB create history in Chepauk?

సీఎస్కే-ఆర్సీబీ హెడ్ ​​టు హెడ్ రికార్డులు

ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై  చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 33 మ్యాచ్‌లు జరగగా, చెన్నై టీమ్ 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆర్సీబీ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇరు జ‌ట్ల చివరి మ్యాచ్ లో బెంగళూరు చెన్నైని 27 పరుగుల తేడాతో ఓడించింది.

ఐపీఎల్‌లో చెపాక్‌లో చెన్నై vs బెంగళూరు హెడ్-టు-హెడ్ రికార్డులు గ‌మ‌నిస్తే మొత్తం మ్యాచ్‌లు 9 జ‌ర‌గ్గా ఇందులో సీఎస్కే 8 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఆర్సీబీ ఒక మ్యాచ్ లో గెలిచింది. చివ‌రి మ్యాచ్ లో చెన్నై టీమ్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది.

55
IPL  CSK vs RCB: Big fight between Virat Kohli and MS Dhoni.. Will RCB create history in Chepauk?

చెపాక్‌లో ఆర్సీబీ జట్టు చరిత్ర సృష్టిస్తుందా? 

గత 17 సంవత్సరాలుగా చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక్కడ రెండు జట్ల మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జ‌రిగాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 8 మ్యాచ్ ల‌లో ఓడిపోయింది. 2008లో ఒక మ్యాచ్‌లో మాత్ర‌మే గెలిచింది. ఐపీఎల్ 2025లో చెపాక్‌లో జ‌రిగే మ్యాచ్ లో విజయం సాధించాల‌ని ఆర్సీబీ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. మ‌రి 17 ఏళ్ల త‌ర్వాతైనా ఆర్సీబీ చెపాక్ లో చెన్నైకి షాక్ ఇస్తుందో లేదో చూడాలి ! 

Read more Photos on
click me!

Recommended Stories