ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్‌లోనూ అదే ఫార్ములా.. వచ్చే సీజన్ నుంచి మహిళా క్రికెట్‌కు మరింత జోష్..

Published : Apr 05, 2023, 06:02 PM IST

WPL: కొద్దిరోజుల క్రితమే   బీసీసీఐ నిర్వహించిన   ఉమెన్స్  ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ విజయవంతమైంది. దీంతో  వచ్చే సీజన్ నుంచి ఈ లీగ్ లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. 

PREV
16
ఐపీఎల్ మాదిరిగానే డబ్ల్యూపీఎల్‌లోనూ అదే ఫార్ములా.. వచ్చే సీజన్ నుంచి మహిళా క్రికెట్‌కు మరింత  జోష్..

బీసీసీఐ  ఈ ఏడాది మార్చిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన   ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతమైంది. ముంబైలోని డాక్టర్ డీ వై పాటిల్,  బ్రబోర్న్ స్టేడియం వేదికలుగా  ఐదు ఫ్రాంచైజీలతో ఆడించిన ఈ టోర్నీ అభిమానులను అలరించింది.  సీజన్లో తొలి అంచె మ్యాచ్ లతో పాటు  ప్లేఆఫ్స్, ఫైనల్స్ కు  స్టేడియాలు కలకలలాడాయి. 

26
Image credit: PTI

తొలి సీజన్ విజయవంతం కావడంతో   వచ్చే  సీజన్ లో  ఈ లీగ్ లో మరికొన్ని మార్పులతో   మరింత రసవత్తరంగా మార్చేందుకు  బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్  లో విజయవంతమైన ‘హోం అండ్ అవే’ ఫార్మాట్ ను  ఐపీఎల్ లో కూడా ప్రవేశపెట్టాలని  బీసీసీఐ భావిస్తున్నది.  

36

‘ఇంటా బయటా’ విధానంతో   ఫ్రాంచైజీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని.. అంతేగాక   ఈ లీగ్ ను కూడా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని   బీసీసీఐ అంచనా వేస్తున్నది. ఈ విధానంతో  పాటు రాబోయే రోజుల్లో టీమ్ ల సంఖ్యను కూడా పెంచుతామని  ఈ మేరకు  ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్  స్పష్టం చేశాడు.  వచ్చే సీజన్ నుంచి డబ్ల్యూపీఎల్ లో  హోం అండ్ అవే పద్ధతిని తీసుకొస్తామని  తెలిపాడు. 

46

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధుమాల్ మాట్లాడుతూ.. ‘డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ మేం అనుకున్నదానికంటే బాగా సక్సెస్ అయింది.    ఈ ఏడాది మేం 5  టీమ్స్ తో ఈ సీజన్ ఆడాం. కానీ రాబోయే సీజన్లలో  టీమ్ ల సంఖ్య కూడా పెరుగనుంది.  అయితే రాబోయే మూడు సీజన్లలో మాత్రం ఇవే  ఐదు ఫ్రాంచైజీలు ఉంటాయి.  

56
Image credit: PTI

అంతేగాక వచ్చే సీజన్ నుంచి   డబ్ల్యూపీఎల్ లో  హోం అండ్ అవే  పద్ధతిన మ్యాచ్ లను నిర్వహించేందుకు  మేం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అయితే  దీనికోసం ఇంకా   చాలా విషయాలను చర్చించాల్సి ఉంది.  హోంఅండ్ అవే  విధానంలో మ్యాచ్ లను నిర్వహిస్తే  టీమ్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్  ఏర్పడుతుంది.  ఏ లీగ్ కు అయినా  అభిమానులే కీలకం..’అని చెప్పాడు. 
 

66
Image credit: PTI

కాగా  ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ లు  ఆడగా  ముంబై - ఢిల్లీ మధ్య ఫైనల్ జరిగింది. ఫైనల్ లో  హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 

click me!

Recommended Stories