అయ్యార్ పాయె రాయ్ వచ్చె.. కోల్కతా సారథి రిప్లేస్మెంట్ ప్రకటించిన కేకేఆర్.. మరి అతడికి..?

Published : Apr 05, 2023, 04:48 PM IST

IPL 2023: ఐపీఎల్ లో   కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్  వెన్ను గాయం కారణంగా   సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే.   

PREV
16
అయ్యార్ పాయె రాయ్ వచ్చె..  కోల్కతా సారథి రిప్లేస్మెంట్ ప్రకటించిన  కేకేఆర్.. మరి అతడికి..?

ఐపీఎల్ లో  కోల్కతా నైట్ రైడర్స్  సారథి  శ్రేయాస్ అయ్యర్  వెన్ను గాయం కారణంగా ప్రస్తుత సీజన్  నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. నిన్నా మొన్నటి వరకూ   ఎన్సీఏలో  చికిత్స తీసుకుంటే సరిపోతుందనుకున్న అయ్యర్..  సర్జరీ తప్పదని  తేలడంతో   ఆపరేషన్ కే మొగ్గు చూపాడు. 

26

అయితే  అయ్యర్ స్థానాన్ని  కేకేఆర్ ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ తో భర్తీ చేసింది.  ఈ మేరకు  కేకేఆర్ ఓ ప్రకటన కూడా వెలువరించింది. అయ్యర్ స్థానంలో  జేసన్ రాయ్ ను జట్టులోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపింది.  

36

రాయ్ ను  కేకేఆర్  రూ.  2.8 కోట్లు వెచ్చించి కొనుగులో చేసింది.  వాస్తవానికి  రాయ్ బేస్ ప్రైజ్   రూ. 1.5 కోట్లు ఉండగా.. అందుకు అదనంగా  మరో రూ. 1.3 కోట్లు వెచ్చించింది.   రాయ్ గతంలో   మూడు సీజన్ల పాటు ఐపీఎల్ ఆడాడు.   2017, 2018,2021లలో  మొత్తంగా 13 మ్యాచ్ లు ఆడాడు.   2021లో అతడు  సన్ రైజర్స్ హైదరాబాద్ కే ప్రాతినిథ్యం వహించాడు.  
 

46

శ్రేయాస్ అయ్యర్ కు గాయం కారణంగా  ఫస్టాఫ్ వరకు  ఆ జట్టు నితీశ్ రాణాను   సారథిగా నియమించుకోగా ఇప్పుడు అయ్యర్ పూర్తి సీజన్ కు దూరం కావడంతో   రాణా.. సీజన్ మొత్తానికి సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ లో  పంజాబ్ తో  డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో  ఓడిన  కేకేఆర్..   గురువారం  ఆర్సీబీతో  కోల్కతా వేదికగా తమ రెండో మ్యాచ్ ఆడనుంది. 

56

ఇదిలాఉండగా  అయ్యర్ స్థానాన్ని భర్తీ చేసిన కేకేఆర్.. ఆల్ రౌండర్ షకిబ్ అల్  హసన్ ప్లేస్ ను మాత్రం  భర్తీ చేయలేదు.   బంగ్లాదేశ్ అంతర్జాతీయ మ్యాచ్ ల షెడ్యూల్ వల్ల  పూర్తి సీజన్ నుంచి  తప్పుకున్న హసన్ స్థానాన్ని  ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.   అతడితో పాటు  బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ కూడా   వచ్చే  అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. 

66

వాస్తవానికి హసన్ స్థానాన్ని శ్రీలంక సారథి దసున్ శనకతో భర్తీ చేయించాలని  కేకేఆర్ ఫ్యాన్స్ భావించారు.   కానీ  శనకను  గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.   తొలి మ్యాచ్ లో గాయపడిన కేన్ విలియమ్సన్ స్థానంలో   శనక.. గుజరాత్ తో కలువనున్నాడు. 
 

click me!

Recommended Stories