టీమిండియా, పాక్‌లో అడుగుపెట్టదు! ఆ మ్యాచ్ జరిగేది అక్కడే... స్పష్టం చేసిన ఐపీఎల్ ఛైర్మెన్

Published : Jul 12, 2023, 05:06 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అక్టోబర్‌లో వన్డే ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ని ఐసీసీ ఇప్పటికే విడుదల చేసినా సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌‌పై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. హైబ్రీడ్ మోడల్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది..

PREV
15
టీమిండియా, పాక్‌లో అడుగుపెట్టదు! ఆ మ్యాచ్ జరిగేది అక్కడే... స్పష్టం చేసిన ఐపీఎల్ ఛైర్మెన్
India vs Pakistan

హైబ్రీడ్ మోడల్ ప్రకారం పాకిస్తాన్‌లో 4 మ్యాచులు జరగబోతుంటే, మిగిలిన 9 మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి. అయితే ఆసియా కప్ కోసం టీమిండియా, పాక్‌లో అడుగుపెట్టకపోతే, వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడే మ్యాచులన్నీ తటస్థ వేదికపై జరగాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది..

25
India vs Pakistan

తాజాగా డర్భన్‌లో బీసీసీఐ సెక్రటరీ జై షాతో కలిసి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ మీట్‌కి హాజరైన ఐపీఎల్ ఛైర్మెన్ అరుణ్ ధుమాల్, ఆసియా కప్ 2023 టోర్నీ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడు..

35

‘బీసీసీఐ సెక్రటరీ జై షా, పీసీబీ హెడ్ జాకా అష్రఫ్‌ని కలిసి ఆసియా కప్ షెడ్యూల్ ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇంతకుముందే దీని గురించి చాలాసార్లు చర్చలు జరిగాయి. పాకిస్తాన్‌లో 4 మ్యాచులు జరుగుతాయి, మిగిలిన 9 మ్యాచులు శ్రీలంకలో జరుగుతాయి..

45
India vs Pakistan

ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది. ఒకవేళ ఇండియా- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరగాల్సి వస్తే అది కూడా శ్రీలంకలోనే జరుగుతుంది. భారత జట్టు మాత్రం పాకిస్తాన్‌లో అడుగుపెట్టదు.. 

55

వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే టీమిండియా, పాకిస్తాన్‌కి రావాలనే చర్చ జరగనే లేదు. టీమిండియా కానీ, బీసీసీఐ సెక్రటరీ కానీ పాకిస్తాన్‌కి వెళ్లడం లేదు. చర్చలన్నీ కూడా తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు అరుణ్ ధుమాల్..

click me!

Recommended Stories