ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా తుది జట్టులో అశ్విన్‌కి చోటు లేకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని, ఇంకొందరికి అసహనాన్ని, మరికొందరికి లేనిపోని అనుమానాలను కలిగించింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో అశ్విన్‌ని తీసుకోకపోవడం వల్లేనని చాలామంది మాజీ క్రికెటర్లు కూడా వ్యాఖ్యానించారు..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, ‘ఇంతకుముందు టీమ్‌లో అందరూ ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లు... ఇప్పుడు పరిస్థితి అలా లేదు, జస్ట్ కోలిగ్స్‌లా ఉంటున్నారంతే..’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి..
26
టీమిండియాలో ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిందని, మన పని ఏంటి? అది చేశామా.. లేదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, కనీసం పక్కనున్న ప్లేయర్ ఎలా ఉన్నాడు? ఏం ఆలోచిస్తున్నాడనే విషయాలను కూడా పట్టించుకోవడం లేదని రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
36
Team India
‘అశ్విన్ చేసిన కోలిగ్స్ కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయి. ఎందుకంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే ఎలా? క్రికెట్ గురించి కాకపోయినా మ్యూజిక్ గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి.. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి..
46
అలా మాట్లాడుకున్నప్పుడే ఆటలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మనసు రిలాక్స్ అవుతుంది. అనవసర ఆలోచనలతో అలిసిపోయిన మెదడు, కాస్త డైవర్ట్ అవుతుంది. ప్లేయర్ల మధ్య అనుబంధం పెరిగి, స్నేహంగా మారుతుంది.
56
మ్యాచ్ అయ్యాక జోకులు, నవ్వులు, అల్లర్లు, సరదాలు, స్నేహాలు... ఇవి చాలా కామన్ అవసరాలు.. నిజానికి ఇంతకుముందు ప్లేయర్లందరికీ ఒకే గదిలో పడేసేవాళ్లు. 20 ఏళ్లకి ముందు ఏ ఫారిన్ టూర్‌కి వెళ్లినా ప్లేయర్లు అంతా కలిసి ఉండాల్సిందే.
66
ఆ తర్వాత ప్లేయర్‌కో సింగిల్ గది ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ప్రతీ ప్లేయర్‌కి ఓ సెపరేట్ స్పెస్ ఉంటోంది. ఇది ప్లేయర్ల మధ్య అంతరం పెంచుతోంది..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..