IPL Auction 2021: బేస్ ప్రైజ్‌కే తెలుగు ప్లేయర్లు... కేకేఆర్‌లోకి హర్భజన్ సింగ్..

First Published Feb 18, 2021, 8:04 PM IST

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్  క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఫాబియన్ అలెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలు...

లియాన్ లివింగ్‌స్టోన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ. 75 లక్షలు...

హర్భజన్ సింగ్‌ను రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది కేకేఆర్. హరి నీశాంత్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. బెన్ కట్టింగ్స్‌ను రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్.
undefined
కేదార్ జాదవ్‌ను రూ.2 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కరణ్ నాయర్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది కేకేఆర్.
undefined
న్యూజిలాండ్ ప్లేయర్ జేమ్స్ నీశమ్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ క్రిస్ గ్రీన్‌, శ్రీలంక పేసర్ ఉసురు ఉదానలను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.
undefined
సౌరబ్ కుమార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. సామ్ బిల్లింగ్స్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ముజీబ్ వుర్ రెహ్మాన్‌ను రూ. కోటిన్నరకి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
undefined
భగవత్ వర్మను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. యుద్ధ్ వీర్ చరక్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్‌సేన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై.
undefined
సుయాశ్ ప్రభుదేశాయ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
undefined
మరో తెలుగు కుర్రాడు హరిశంకర్ రెడ్డి‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. పేసర్ కుల్దిప్ యాదవ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్.
undefined
లియాన్ లివింగ్‌స్టోన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, కరణ్ శర్మ, కెఎల్ శ్రీజిత్, బెన్ ద్వాసిస్, పెరియస్వామి, బెన్ మెక్‌డెర్మోట్, సీన్ అబ్బాట్, సిద్ధేశ్ లాడ్, తజిందర్ దిల్లాన్, పరేక్ మంకడ్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.
undefined
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ క్రిస్టియన్‌ కోసం కేకేఆర్, ఆర్‌సీబీ జట్లు పోటీ పడ్డాయి. క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
undefined
భారత యంగ్ ప్లేయర్ జలజ్ సక్సేనా‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...ఉత్కర్ష్ సింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోల చేసింది పంజాబ్ కింగ్స్. వైభవ్ అరోరాను కేకేఆర్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఫాబియన్ అలెన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.
undefined
click me!