IPL Auction 2021: సచిన్, అజారుద్దీన్, కోహ్లీ, ఏబీడీ, మ్యాక్స్‌వెల్... అందరూ ఒకే జట్టులో!

First Published Feb 18, 2021, 5:59 PM IST

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీల్లో 37 బంతుల్లో సెంచరీ చేసిన అజారుద్దీన్‌...

అజారుద్దీన్‌ రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్...

ఆస్ట్రేలియా బౌలర్ రిలే మెరేడిత్‌‌కి రూ. 8 కోట్లు...

సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీల్లో 37 బంతుల్లో సెంచరీ చేసిన కేరళ యంగ్ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
undefined
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీలో ముంబై బౌలర్లను ఓ ఆటాడుకుంటూ 137 పరుగుల భారీ సెంచరీ బాదాడు అజారుద్దీన్. 26 ఏళ్ల ఈ కేరళ బ్యాట్స్‌మెన్ టోర్నీలో 5 మ్యాచుల్లో 53.50 సగటుతో 214 పరుగులు చేశాడు. అజారుద్దీన్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది.
undefined
అతనితో పాటు సచిన్ బేబీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. వీరితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం ఏకంగా రూ.14 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది ఆర్‌సీబీ.
undefined
వచ్చే సీజన్‌లో సచిన్, అజారుద్దీన్, మ్యాక్స్‌వెల్, కోహ్లీ, ఏబీడీ ఒకే జట్టులో ఆడబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
undefined
వీరితో పాటు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన చేతన్ సకారియా కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. చేతన్ సకారియాను రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్
undefined
లుక్మన్ మెరివాలాను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.ఎం. సిద్ధార్థ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. జగదీశ సుచిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
undefined
ఆస్ట్రేలియా బౌలర్ రిలే మెరేడిత్‌ కోసం ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. కరియప్పను‌ రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
undefined
click me!