IPL 2026 Eliminator: నో రిజర్వ్ డే.. ఎలిమినేటర్ మ్యాచ్ వర్షంతో రద్దయితే SRH పరిస్థితి ఏంటి?

Published : May 26, 2026, 07:07 PM IST

SRH vs RR Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ కు రిజర్వు డే లేదు. మరి వర్షం వల్ల ఈ పోరు రద్దయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది? ఐపీఎల్ 2026 రూల్స్ ఏం చెబుతున్నాయి?

PREV
15
ఐపీఎల్ ఫైనల్ ఫైట్.. నో రిజర్వ్ డే ట్విస్ట్

క్రికెట్ లవర్స్ కు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఐపీఎల్ 2026 సీజన్ లాస్ట్ స్టేజ్‌కు వచ్చేసింది. ఇక మిగిలింది కేవలం నాలుగు మ్యాచ్‌లే.. కప్ ఎవరిదో తేలిపోయే టైమ్ దగ్గర పడింది. న్యూఛండీఘర్ స్టేడియంలో మే 27న జరిగే హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) ఢీ కొట్టేందుకు రెడీ అయిపోయాయి.

ఐపీఎల్ రూల్స్ ప్రకారం కేవలం ఫైనల్ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 తో పాటు ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌కు కూడా ఎలాంటి రిజర్వ్ డే లేదు. అంటే మ్యాచ్ రోజు వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే పరిస్థితి ఏంటనే టెన్షన్ ఇప్పుడు అభిమానుల్లో స్టార్ట్ అయింది.

25
వర్షం పడి మ్యాచ్ రద్దయితే SRH కు పండగే..

ఒకవేళ బ్యాడ్ లక్ కొద్దీ న్యూఛండీఘర్‌లో వర్షం పడి ఎలిమినేటర్ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఏమవుతుందో తెలుసా? ఐపీఎల్ అఫీషియల్ రూల్స్ ప్రకారం లీగ్ స్టేజ్‌లో పాయింట్ల పట్టికలో ఏ టీమ్ టాప్‌లో ఉంటే ఆ టీమ్ నెక్స్ట్ లెవెల్‌కు ప్రమోట్ అవుతుంది. ఈ రూల్ ఆరెంజ్ ఆర్మీకి ఫుల్ బెనిఫిట్ ఇవ్వనుంది.

లీగ్ స్టేజ్ ముగిసేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. సో, ఒకవేళ మ్యాచ్ వాషౌట్ అయితే, పాయింట్స్ టేబుల్‌లో ముందంజలో ఉన్న సన్‌రైజర్స్ నేరుగా క్వాలిఫయర్-2 కు దూసుకెళ్తుంది. రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి అవుట్ అవుతుంది.

35
ఐపీఎల్ 2026 : క్వాలిఫయర్స్ రూల్స్ ఎలా ఉన్నాయి?

ఇదే రూల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లకు కూడా అప్లై అవుతుంది. క్వాలిఫయర్-1 లో తలపడే ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కూడా వర్షం వల్ల ఆగిపోతే, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ డైరెక్ట్‌గా ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది. గుజరాత్ టీమ్ క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది.

ఒకవేళ క్వాలిఫయర్-2 కూడా వర్షార్పణం అయితే, క్వాలిఫయర్-1 లో ఓడిపోయిన టీమ్‌కే ఫైనల్ టికెట్ దక్కుతుంది. ఇక మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్‌కు మాత్రం పక్కాగా రిజర్వ్ డే కేటాయించారు. ఒకవేళ ఫైనల్ రోజు, రిజర్వ్ డే రోజు కూడా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే, అప్పుడు లీగ్ స్టేజ్ పాయింట్స్ టేబుల్ టాపర్‌ను ఐపీఎల్ విజేతగా అనౌన్స్ చేస్తారు.

45
రాయల్స్ పై సన్‌రైజర్స్ సూపర్ రికార్డ్.. హాట్ ఫేవరెట్ హైదరాబాదే

ఐపీఎల్ హిస్టరీలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి, ఆ తర్వాత కప్ కొట్టిన ఏకైక రికార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ఉంది. అందుకే ప్లే ఆఫ్స్‌లో సన్ రైజర్స్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. పైగా రాజస్థాన్ రాయల్స్‌పై ఆరెంజ్ ఆర్మీకి తిరుగులేని రికార్డు ఉంది.

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు జరగ్గా.. సన్‌రైజర్స్ 14 సార్లు, రాజస్థాన్ 9 సార్లు గెలిచాయి. ఇక ఈ 2026 సీజన్‌లో జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ను హైదరాబాద్ ఘోరంగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సన్‌రైజర్స్ ఫుల్ ఫామ్‌లో ఉండటంతో ముచ్చటగా మూడోసారి కూడా ఆర్ఆర్‌ను దెబ్బకొట్టి టైటిల్ రేసులో నిలవాలని కమిన్స్ సేన గట్టి ప్లాన్‌తో ఉంది.

55
SRH Playing XI: రాజస్థాన్ పని పట్టేందుకు సన్‌రైజర్స్ మాస్ ప్లాన్ !

రాజస్థాన్‌తో జరిగే ఈ డూ ఆర్ డై మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. న్యూఛండీఘర్ పిచ్ బ్యాటింగ్‌కు బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మన బ్యాటర్లు రెచ్చిపోవడం ఖాయం. అయితే బౌలింగ్‌లో రాజస్థాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడానికి సన్‌రైజర్స్ ఒక సీక్రెట్ వెపన్‌ను రంగంలోకి దించుతోంది. వైభవ్‌పై మంచి రికార్డు ఉన్న యంగ్ పేసర్ ప్రఫుల్ హింగే ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సీనియర్ బౌలర్ హర్షల్ పటేల్‌పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే రవిచంద్రన్ స్మరణ్ ప్లేస్‌లో హర్ష్ దూబేను టీమ్‌లోకి తీసుకోవచ్చు. ఈ రెండు ఛేంజెస్ మినహా విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకపోవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 అంచనా జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, రవిచంద్రన్ స్మరణ్/హర్ష్ దూబే, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే/హర్షల్ పటేల్.

Read more Photos on
click me!

Recommended Stories