Published : May 26, 2026, 05:15 PM ISTUpdated : May 26, 2026, 05:30 PM IST
RCB vs GT: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో RCB, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఫైనల్‌కు ఎవరు వెళ్తారు? రిజర్వ్ డే ఉందా? అనే విషయాలు ఇక్కడ చూద్దాం.
2026 ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇవాళ్టి (మే 26) నుండే ప్లేఆఫ్స్ మొదలవుతున్నాయి. ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్-1లో పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2లో మరో ఛాన్స్ ఉంటుంది.
24
వర్షం పడితే ఎవరికి లాభం..?
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ ధర్మశాలలో వర్షం కురిసి క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది? ఎవరికి ప్లస్ అవుతుంది? క్వాలిఫయర్-1కి రిజర్వ్ డే ఉందా? అని అభిమానుల్లో చాలా ప్రశ్నలున్నాయి.
ఒకవేళ క్వాలిఫయర్-1 మ్యాచ్ వర్షంతో రద్దయితే డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫైనల్‌కు వెళ్లే గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఫైనల్ మినహా ఏ మ్యాచ్‌కూ రిజర్వ్ డే లేదు. కాబట్టి లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉన్న RCB నేరుగా ఫైనల్ కి చేరుతుంది.
34
రెండు బలమైన జట్లు
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. ఒకవేళ వర్షంతో క్వాలిఫయర్-1 రద్దయితే, గుజరాత్ విజయయాత్రకు చిన్న బ్రేక్ పడుతుంది. కానీ ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ తలపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కి చేరుతుంది.
రజత్ పాటీదార్ నాయకత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు RCB కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడాడు. ఒత్తిడిలో బాగా ఆడే జట్టే గెలుస్తుందని, తమ జట్టు బలం బౌలింగే అని చెప్పాడు. డిఫెన్సివ్ గేమ్ ఆడే ఆలోచన లేదని, అటాకింగ్ చేయడమే తమ ప్లాన్ అని స్పష్టం చేశాడు. "మా బలం బౌలింగే. పవర్‌ప్లేలో మేము ఎలా బౌలింగ్ చేస్తామనేది చాలా ముఖ్యం. మేము డిఫెన్సివ్ ఆడటానికి రాలేదు, అటాకింగ్ మైండ్‌సెట్‌తోనే వచ్చామని అందరికీ తెలుసు. ఆరంభంలోనే వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం. భువి, హేజిల్‌వుడ్, రసిక్ అదే చేస్తున్నారు. ఇదే పంథాను కొనసాగించాలనుకుంటున్నాం" అని అతను చెప్పాడు.