ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ ఒక్క పోస్ట్‌తో ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతోంది. ఈ స్టార్ ఆల్ రౌండర్ ముంబై ఇండియన్స్ టీమ్‌ను వీడుతున్నాడనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ప్రయాణం ముగిసిన వెంటనే హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక మిస్టీరియస్ పిక్చర్ షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఒక లాప్‌టాప్, అందులో ఏదో సినిమా ప్లే అవుతోంది, పక్కనే ఒక నోట్‌బుక్, పెన్, ఇంకా అతని మొబైల్ ఫోన్ ఉన్నాయి. అయితే, అందరి కన్ను ఆ మొబైల్ స్క్రీన్ మీద పడింది. ఎందుకంటే ఆ ఫోన్‌లో టైమ్ '07:07' అని చూపిస్తోంది. క్రికెట్ వరల్డ్‌లో నంబర్ '7' అంటే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండ్ ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ అని అందరికీ తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యా నెక్స్ట్ సీజన్‌లో ధోనీ టీమ్‌లోకి వెళ్లబోతున్నాడా అనే చర్చ మొదలైంది.
24
ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ షో
హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 2026 సీజన్ అస్సలు కలిసి రాలేదు. కెప్టెన్‌గా చాలా ఇబ్బందులు పడ్డాడు. గాయాల వల్ల మూడు మ్యాచ్‌లకు దూరం కూడా అయ్యాడు. ముంబై ఇండియన్స్ టీమ్ ఈ సీజన్‌లో చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ముంబై టీమ్ పాయింట్ల పట్టికలో కేవలం నెట్ రన్ రేట్ వల్ల బాటమ్ ప్లేస్ తప్పించుకుని, 9వ స్థానంలో నిలిచింది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో సమానంగా కేవలం 8 పాయింట్లతో (4 విజయాలు) సీజన్‌ను ముగించింది. ప్లేఆఫ్స్ రేస్ నుండి ముంబై చాలా త్వరగానే అవుట్ అయింది. ముంబై ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. హార్దిక్ కెప్టెన్సీలో 11 మ్యాచ్‌లు ఆడితే కేవలం 3 మాత్రమే గెలిచింది. అతను లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయగా, ఒక మ్యాచ్ గెలిచి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో ముంబై ఘోరంగా టోర్నీ నుండి వైదొలిగింది.
34
ప్లేయర్‌గానూ నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా
గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్‌కు భారీ ట్రేడింగ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యా, మూడు సీజన్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ అందులో రెండు సీజన్లలో ముంబై ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. కేవలం ఐపీఎల్ 2025 లో మాత్రమే ముంబై టాప్-4 కు వెళ్ళింది. ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ వ్యక్తిగత ప్రదర్శన కూడా చాలా వీక్‌గా ఉంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించలేదు.
పాండ్యా మొత్తం 10 మ్యాచ్‌ల్లో కేవలం 206 రన్స్ మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 138.25 గా ఉంది. బౌలింగ్‌లో 11.42 ఎకానమీతో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ పేలవమైన ఫామ్ వల్ల, ముంబై మేనేజ్‌మెంట్‌తో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. హార్దిక్ సోషల్ మీడియాలో ముంబై ఫ్రాంచైజీని అన్‌ఫాలో చేశాడనే టాక్ కూడా నడిచింది.
ఈ '07:07' పోస్ట్ తర్వాత హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరి, వచ్చే సీజన్‌లో ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తాడనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి ధోనీ దూరం కావడంతో, ఐపీఎల్ 2027 లో అతను ఆడటం కష్టమే అని తెలుస్తోంది. శివమ్ దూబే వంటి ప్లేయర్లతో ట్రేడింగ్ లేదా స్వ్యాప్ డీల్స్ ఉండొచ్చని సోషల్ మీడియాలో అభిమానులు లెక్కలు వేస్తున్నారు.
అయితే, దీనిపై అటు ముంబై ఇండియన్స్ కానీ, ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మాట్లాడుతూ.. "ప్రస్తుతం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీజన్ ముగిసిన వెంటనే ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోలేం. ఎక్కడ తప్పు జరిగిందో కూర్చొని ఆలోచించి మేనేజ్‌మెంట్ మంచి నిర్ణయం తీసుకుంటుంది" అని క్లారిటీ ఇచ్చాడు.