IPL 2026 Playoff Scenarios: ప్లేఆఫ్స్ రేస్ లో నిలిచేది ఎవరు? చెన్నైకి ఛాన్సుందా? ఆ 3 టీమ్స్ దాదాపు ఫిక్స్! లెక్కలు ఇవే

Published : May 12, 2026, 10:22 AM IST

IPL 2026 Playoff Scenarios : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్ రసవత్తరంగా మారింది. ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ లకు 80% అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులో ఉన్నాయి. పంజాబ్ ఓటమితో కష్టాల్లో పడింది.

PREV
14
ఐపీఎల్ ప్లేఆఫ్స్ లెక్కలు మార్చేసిన అక్షర్ పటేల్.. ప్లేఆఫ్స్ బెర్త్ లో నిలిచేది ఎవరు?

ఐపీఎల్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఫిక్స్ చేసుకోలేదు. పాయింట్ల పట్టిక చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ టీమ్‌కు ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

24
టాప్-3 లో గట్టి పోటీ.. 80% ఛాన్స్ ఆ జట్లకే

ప్రస్తుత ఐపీఎల్ పాయింట్ల పట్టిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు సేఫ్ జోన్ లో ఉన్నాయి. ఈ మూడు టీమ్స్ 11 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ లెక్కల ప్రకారం.. ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఏకంగా 80 శాతంగా ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండింటిని గెలిస్తే ఎలాంటి డోకా లేకుండా టాప్-4 లో నిలుస్తాయి.

34
చెన్నై, రాజస్థాన్ పరిస్థితి ఏంటి?

ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ప్రస్తుతం టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో సీఎస్కే ఐదో స్థానంలో ఉంది. వైభవ్ సూర్యవంశీ ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. గణాంకాల ప్రకారం.. సీఎస్కే ప్లేఆఫ్స్ చేరే అవకాశం 42.7 శాతం ఉండగా, రాజస్థాన్ రాయల్స్‌కు 41.8 శాతం ఛాన్స్ ఉంది. ఈ రెండు జట్లు తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని భారీ నెట్ రన్ రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

44
ప్లేఆఫ్స్ చేరాలంటే ఉండాల్సిన మ్యాజిక్ నంబర్ ఇదే

ఐపీఎల్‌లో 10 టీమ్స్ వచ్చినప్పటి నుండి ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు మ్యాజిక్ నంబర్ గా మారాయి. 2022, 2023, 2025 సీజన్లలో 16 పాయింట్లు సాధించిన జట్లే నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ వెళ్లాయి. కేవలం 2024లో మాత్రమే 14 పాయింట్లు ఉన్న నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొనగా, మెరుగైన రన్ రేట్ ఉన్న ఆర్సీబీ క్వాలిఫై అయ్యింది.

కాబట్టి, ఈసారి కూడా 16 పాయింట్లు సాధిస్తేనే గ్యారెంటీ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (10 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (9 పాయింట్లు) కూడా రేసులో ఉన్నప్పటికీ, వారి అవకాశాలు కేవలం 1.2% నుండి 11% మధ్యే ఉన్నాయి. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే టోర్నీ నుండి అవుట్ అయ్యాయి.

Read more Photos on
click me!

Recommended Stories