IPL 2025: ధోని టీమ్ CSK థీమ్ సాంగ్.. అనిరుధ్ ఎందుకు నో చెప్పాడు?

Published : Mar 19, 2025, 08:58 PM IST

Anirudh Refuses CSK Theme Song Offer: ఐపీఎల్‌లో ఆడే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోసం థీమ్ మ్యూజిక్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎందుకు నో చెప్పాడు.

PREV
15
IPL 2025: ధోని టీమ్ CSK థీమ్ సాంగ్..  అనిరుధ్ ఎందుకు నో చెప్పాడు?
Anirudh Refuses CSK Theme Song Offer Due to Iconic Whistle Podu IPL 2025

Anirudh Refuses CSK Theme Song Offer: తమిళ చిత్ర పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఆయన పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది అయన చేసే ప్రాజెక్టులు. అనిరుధ్ చివరగా తమిళ సూపర్ స్టార్ అజిత్  కుమార్  విడాముయర్చి సినిమాకి మ్యూజిక్ అందించారు. దీని తర్వాత అనిరుధ్ మ్యూజిక్ లో కూలీ సినిమా వస్తోంది. ఈ సినిమాని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయి బ్యాక్ గ్రౌండ్ పనులు జరుగుతున్నాయి.

25
Anirudh Refuses CSK Theme Song Offer Due to Iconic Whistle Podu IPL 2025

కూలీ సినిమా తర్వాత అనిరుధ్ చేతిలో ఉన్న మరో పెద్ద సినిమా జన నాయకన్. ఈ సినిమాని హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ తో జరుగుతోంది. జన నాయకన్ సినిమాతో నటుడు విజయ్ సినిమా రంగం నుంచి దూరం అవుతున్నారు. అందుకే ఈ సినిమా కోసం అనిరుధ్ స్పెషల్ గా చాలా పాటలు కంపోజ్ చేస్తున్నారు.

35
Anirudh Refuses CSK Theme Song Offer Due to Iconic Whistle Podu IPL 2025

దీంతో బిజిబిజీగా గడుపుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మస్తు క్రేజ్, సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) కోసం థీమ్ మ్యూజిక్ చేయడానికి నిరాకరించారు. అయితే, అనిరుధ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి పెద్ద అభిమాని. ధోని టీమ్ కు బిగ్ ఫ్యాన్ అయి ఉండి కూడా CSK కోసం అనిరుధ్ థీమ్ మ్యూజిక్ చేయడానికి ఎందుకు నిరాకరించారు.

45
Anirudh Refuses CSK Theme Song Offer Due to Iconic Whistle Podu IPL 2025

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాలు బ్యాన్ కి గురైందని అందరికీ తెలిసిందే. ఆ బ్యాన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2018లో కమ్ బ్యాక్ ఇచ్చి CSK కప్ గెలిచి దుమ్ము రేపింది. అప్పుడు CSK మేనేజ్మెంట్ అనిరుధ్ ని వాళ్ళ టీమ్ కోసం ఒక థీమ్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఇవ్వమని అడిగారు. కానీ అనిరుధ్ ఆ ఆఫర్ ని ఒప్పుకోవడానికి నిరాకరించారు. అలా ఎందుకు చేశానని వివరాలు అనిరుధ్ పంచుకున్నారు. 

55
Anirudh Refuses CSK Theme Song Offer Due to Iconic Whistle Podu IPL 2025

చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ సాంగ్ చేయడానికి నిరాకరించడంపై  అనిరుధ్ మాట్లాడుతూ.. CSK అంటే మనకి గుర్తుకు వచ్చేది విజిల్ పోడు సాంగ్. ఆ పాట వింటే నాకూ గూస్ బంప్స్ వస్తాయి. ఆ థీమ్ మ్యూజిక్ కి నేను పెద్ద అభిమానిని. ఆ థీమ్ మ్యూజిక్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ని నేను మ్యాచ్ చేయలేను. ఎలా రజినీ సర్ కి అన్నాత్తే థీమ్ మ్యూజిక్ ఎంత స్పెషలో అదే విధంగా CSK కి విజిల్ పోడు ఉండాలి. అది అభిమానుల మధ్యలో కూడా వేరే లెవెల్ లో రీచ్ అయింది. అందుకే నేను మళ్ళీ ఒక థీమ్ మ్యూజిక్ చేయడానికి సాధ్యం కాదు అని చెప్పి నిరాకరించారని చెప్పినట్టు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ కోసం విజిల్ పోడు సాంగ్ ని క్రియేట్ చేసింది ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories