ఐపీఎల్ 2025: కోహ్లీ టీమ్ RCB కొనుగోలు చేసే 5 మంది ఆటగాళ్ళు వీరే

First Published | Nov 6, 2024, 6:31 PM IST

IPL 2025 Royal Challengers Bangalore : 2025 ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డా, సౌదీ అరేబియాలో జరగనుంది. ఆర్‌సీబీ ఇప్పటికే విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, యశ్ దయాల్ ను రిటైన్ చేసుకుంది. అయితే, వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసే టాప్-5 ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ), ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌ర్వం సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రాబోయే సీజ‌న్ కోసం రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల వివ‌రాలను ప్ర‌క‌టించాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌ని విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 ఎడిష‌న్ లో త‌మ తొలి తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవ‌డంపై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్‌లను రిటైన్ చేసుకుంది.

విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు), రజత్ పటీదార్ (రూ. 11 కోట్లు), యష్ దయాల్ (రూ. 5 కోట్లు) ఈ ముగ్గురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఆర్సీబీ రూ. 37 కోట్ల రూపాయలు వెచ్చించింది. వేలానికి 83 కోట్లు మిగిలాయి.

రాబోయే సీజ‌న్ ఐపీఎల్ 2025 కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను మాత్ర‌మే రిటైన్ చేసుకుంది. వేలంలో ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్ల‌పై క‌న్నేసింది. ఇందులో విదేశీ ప్లేయ‌ర్ల‌తో పాటు భార‌త ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ, రజత్ పటిదారు, యశ్ దయాల్ తో పాటు  ఆర్సీబీ టీమ్ లో కనిపించబోయే స్టార్ 5 ప్లేయర్ల గుర్తించి ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos


1. మహమ్మద్ సిరాజ్

ఐపీఎల్ లో 93 వికెట్లు తీసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కీలక పేసర్ మహమ్మద్ సిరాజ్‌ను రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. అయితే, సిరాజ్ ను తిరిగి దక్కించుకోవడానికి 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డును ఉపయోగించవచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

2018లో వేలంలో రూ.2.2 కోట్లకు ఆర్సీబీ ఫ్రాంచైజీలో చేరిన సిరాజ్ కొన్నేళ్లుగా జట్టుకు అత్యంత విలువైన, ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు భ‌యంక‌ర‌మైన బౌలింగ్ ఆప్షన్ గా నిలిచాడు. ఆర్సీబీలో చేరినప్పటి నుంచి సిరాజ్ 87 మ్యాచ్ ల‌లో 83 వికెట్లు పడగొట్టగా, 2023 సీజన్లో 4/21 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. గత సీజన్లో 14 మ్యాచ్ ల‌లో 33.07 సగటు, 9.19 ఎకానమీ, 21.60 స్ట్రైక్ రేట్ తో 15 వికెట్లు పడగొట్టాడు.

2. విల్ జాక్స్

గత సీజన్‌లో ఆర్‌సీబీ తరపున సెంచరీ (230 పరుగులు, 2 వికెట్లు) సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ విల్ జాక్స్‌ను RTM కార్డుతో నిలుపుకునే ఛాన్స్ కూడా ఉంది. విల్ జాక్స్ బ్యాటింగ్ తో ఆ జ‌ట్టుకు అద్భుత‌మైన బ‌లాన్ని అందించే ప్లేయ‌ర్.  బ్యాటింగ్ తో పాటు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బౌలింగ్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న ఆట‌గాడు.

రాబోయే మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసిన విల్ జాక్స్ IPL 2024 సీజన్ రెండవ భాగంలో ఆర్సీబీ పునరాగమనంలో కీలక పాత్ర పోషించాడు. తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో వ‌చ్చిన‌ జాక్స్ 175 స్ట్రైక్ రేట్‌తో 230 పరుగులతో ఆర్సీబీ టాప్ ఆర్డర్ లో కీల‌క పాత్ర పోషించాడు. 

3. గ్లెన్ మ్యాక్స్‌వెల్

మ్యాక్స్‌వెల్‌ను వదిలేసే ముందు ఆర్‌సీబీ అతనితో చర్చలు జరిపినట్లు తెలిసింది. వేలం ద్వారా మళ్ళీ ఆర్‌సీబీలో చేరతానని మ్యాక్స్‌వెల్ ధీమాతో ఉన్నట్టు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తనను విడుదల చేస్తామని ఫ్రాంచైజీ ఆసీస్ స్టార్ కు తెలియజేసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అరగంట పాటు ఫోన్లో మాట్లాడినట్లు గ్లెన్ మ్యాక్స్ వెల్ వెల్ల‌డించాడు.

2021 నుంచి ఫ్రాంచైజీలో ఉన్నాడు. మ్యాక్స్ వెల్ ను ఆర్సీబీ రూ.14.25 కోట్లకు కొనుగోలు చేయగా, ఐపీఎల్ చివరి నాలుగు సీజన్లలో అత‌ని ప్ర‌ద‌ర్శ‌న ఎత్తుపల్లాల‌తో ముందుకు సాగింది. ఆర్సీబీ తరఫున 52 మ్యాచ్ ల‌ను ఆడి మ్యాక్స్ వెల్ 12 హాఫ్ సెంచరీలతో సహా 1266 పరుగులు చేశాడు. 2024 లో అత‌ని ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 10 మ్యాచ్ ల‌లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. 

4. జోస్ బట్లర్

రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్‌ను ఊహించని విధంగా వదిలేసింది. దీంతో ఆర్సీబీ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌కు కీలక పాత్ర పోషించిన బట్లర్‌ను ఫ్రాంచైజీ నిలబెట్టుకోలేదు. ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్, ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడే బ‌ట్ల‌ర్ రిటైన్ కాకపోవడంతో ఇది పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది.

అతను 2018 నుండి జట్టులో భాగమైన తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు మూలస్తంభంగా ఉన్నాడు. అనేక కీల‌క‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. అత‌న్ని ఆర్ఆర్ వ‌దులుకోవ‌డంతో బెంగ‌ళూరుతో పాటు చెన్నై, కేకేఆర్ టీమ్స్ కూడా బట్ల‌ర్ పై క‌న్నేశాయి.  

5. మహమ్మద్ షమీ

గుజరాత్ టైటాన్స్ వదిలేసిన భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీని వేలంలో దక్కించుకోవడానికి ఆర్‌సీబీ వ్యూహాలు రచిస్తోంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత గాయం కారణంగా షమీ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వారి బౌలింగ్ స‌మ‌స్య‌ల‌తో చాలా కాలంగా పోరాడుతోంది. ఎక్కువ‌గా ఆ టీమ్ బ్యాటింగ్ విభాగంపై దృష్టి పెడుతోంది. కీలక బౌలర్ల నిష్క్రమణ గుర్తించదగిన గ్యాప్ ను పూడ్చ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీని కోసం ష‌మీని తీసుకోవాల‌ని చూస్తోంది. 

click me!