IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం అన్ని ఫ్రాంఛైజీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవలే ఐపీఎల్ మెగా వేలం 2025 జెడ్డాలోని అబాది అల్ జోహార్ అరేనాలో జరిగింది. రెండు రోజుల పాటు 10 ఫ్రాంఛైజీలు తమ వ్యూహాలను పక్కాగా ప్లాన్ చేసుకున్నాయి. రాబోయే సీజన్ కోసం తమకు కావాల్సిన ప్లేయర్లను జట్టులోకి తీసుకున్నాయి.
ఐపీఎల్ మెగా వేలంలో రిషబ్ పంత్ కొత్త రికార్డులు
ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. IPL 2025 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అంతకుముందు ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదులుకున్న తర్వాత ఈ కొనుగోలు అసాధారణమైనదని చెప్పాలి. వేలానికి ముందు లక్నో టీమ్ కేఎల్ రాహుల్ ను వదులుకుంటూ.. నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్‌లను రిటైన్ చేసుకుంది.
Zaheer Khan, KL Rahul, LSG, IPL 2025,
సరైన రెగ్యులర్ ఓపెనర్ లేని టీమ్ లక్నో.. రిషబ్ పంత్ జోడీ ఎవరు?
ఐపీఎల్ మెగా వేలం 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాలు ఒక్క రిషబ్ పంత్ విషయంలోనే సక్సెస్ అయినట్టు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అతనికి భారీ మొత్తాన్ని కట్టబెడుతూ ఆ జట్టు ఓపెనర్‌ను కొనుగోలు చేయాలనే వ్యూహాన్ని నిర్లక్ష్యం చేసింది. ఐపీఎల్ వేలం 2025 ముగిసిన తర్వాత లక్నో జట్టును గమనిస్తే సరైన రెగ్యులర్ ఓపెనర్ లేడు. కానీ, జట్టులో ఉన్న ప్లేయర్లను గమనిస్తే వారిలో కొంత మంది ప్లేయర్లు ఇది వరకు జట్టు ఇన్నింగ్స్ లను ప్రారంభించిన ప్లేయర్లు ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి..
Mitchell Marsh
మిచెల్ మార్ష్
ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ లక్నో జట్టులో ఉన్నాడు. అతను ఎల్ఎస్జీకి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఎంపికలలో ఒకరు. 2024లో ఈ ఆల్ రౌండర్ ఓపెనర్‌గా రెండు మ్యాచ్‌లు ఆడాడు. 179.2 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా అతనికి పెద్దగా అనుభవం లేకపోయినా, మూడో నంబర్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. ఆ స్థానంలో మార్ష్ మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 126.0 స్ట్రైక్ రేట్‌తో 999 పరుగులు చేశాడు. ఆరు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. అయితే, అతని ఆల్ రౌండ్ ప్రదర్శన సామర్థ్యాలు గమనిస్తే మిచెల్ మార్ష్ కు అవకాశం ఇస్తే ఓపెనర్‌గా కూడా లక్నో టీమ్ కు మంచి ఇన్నింగ్స్ లు ఆడే అవకాశముంది.
ఐడెన్ మార్క్రామ్
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడెన్ మార్క్రామ్ ఐపీఎల్ 2025 లో లక్నో జట్టు తరఫున ఆడనున్నాడు. తన దేశానికి నాయకత్వం వహించే ఈ ప్లేయర్ లక్నో జట్టులో ఉన్న మరొక కెప్టెన్. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ తన కెరీర్‌లో ఇది వరకు ఓపెనర్‌గా కూడా ఆడాడు. 2018లో అతను ఓపెనర్‌గా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఒక అర్ధ సెంచరీతో సహా 118.3 స్ట్రైక్ రేట్‌తో 142 పరుగులు చేశాడు. అయితే, మూడవ స్థానంలో అతను తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. 119.9 స్ట్రైక్ రేట్‌తో 175 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంలో అతని అనుభవం ఉండటంతో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు ఐడెన్ మర్కామ్ కూడా ఓపెనర్ గా ఒక ఎంపిక కావచ్చు.
Rohit Sharma-Rishabh Pant
రిషబ్ పంత్
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కీపింగ్ తో పాటు అద్బుతమైన బ్యాటింగ్ సామర్థ్యం కలిగి ప్లేయర్. కేఎల్ రాహుల్ ను వదులుకోవడంతో లక్నో టీమ్ పంత్ ను కెప్టెన్ స్థానంతో పాటు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలంగా మార్చే లక్ష్యంతో ఐపీఎల్ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది. రిషబ్ పంత్ IPLలో అటాకింగ్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తం 110 మ్యాచ్‌లు ఆడాడు, 148.9 స్ట్రైక్ రేట్‌తో 3,283 పరుగులు చేశాడు. 2024 సీజన్ లో ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడాడు. 155.40 స్ట్రైక్ రేట్‌తో 13 మ్యాచ్‌లలో మూడు అర్ధ సెంచరీలతో 446 పరుగులు చేశాడు.
ఇక దేశవాళీ క్రికెట్ లో రిషబ్ పంత్ టీ20 క్రికెట్‌లో ఓపెనర్‌గా నాలుగు ఇన్నింగ్స్ లను ఆడాడు. ఈ సమయంలో 136.8 స్ట్రైక్ రేట్‌తో ఆ ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు చేశాడు. ఓపెనర్ గా పెద్దగా అనుభవం లేకపోయిన మూడో స్థానంలో అద్భుతమైన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. కాబట్టి రిషబ్ పంత్ కూడా లక్నో టీమ్ కు ఒక ఓపెనర్ ఎంపికగా ఉన్నాడు.
ఐపీఎల్ 2025లో ఎవరు ఓపెనింగ్ చేస్తే లక్నో టీమ్ లాభం కలుగుతుంది?
రిషబ్ పంత్, మిచెల్ మార్ష్‌లు ఇన్నింగ్స్ ఓపెనర్‌గా ఉంటే లక్నో టీమ్ కు మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. ఎందుకంటే, విధ్వంసక బ్యాటర్‌గా మిచెల్ మార్ష్ భారీ షాట్‌లు కొట్టగలడు. ఇక రిషబ్ పంత్ స్థిరపడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. తనదైన అటాకింగ్ ఆటను ఆడతాడు. వీరిద్దరూ కలిసి IPL 2025లో LSG ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఐడెన్ మార్క్రామ్ నాలుగో స్థానంలో రావచ్చు. ఎందుకంటే, వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ లక్నో టీమ్ కు మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగే ప్లేయర్ గా ఉన్నాడు. మార్క్రామ్ యాంకర్‌గా ఆడగలడు.. మిడిల్ ఆర్డర్‌లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగల ప్లేయర్. మార్ష్, పంత్ ఓపెనింగ్ పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్ లతో జట్టును ముందుకు నడిపించే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ 2025: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇదే
బ్యాటర్స్ : డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్, ఆర్యన్ జుయల్
వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్
ఆల్ రౌండర్లు: అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, ఐడెన్ మర్క్రామ్
ఫాస్ట్ బౌలర్లు: మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్
స్పిన్నర్లు: రవి బిష్ణోయ్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్