ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న టాప్-5 ప్లేయర్లు ఎవరు?

Published : Apr 22, 2025, 08:09 PM IST

Most Player of the Match awards in IPL: ముంబై ఇండియన్స్ (MI) స్టార్ బ్యాటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో మరో రికార్డు సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని అధిగమించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' (POTM) అవార్డులను అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. అయితే, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న టాప్-5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న టాప్-5 ప్లేయర్లు ఎవరు?
IPL 2025: Most Player of the Match awards in Indian Premier League history

5. ఎంఎస్ ధోని & డేవిడ్ వార్నర్ 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోని, మాజీ ఐపీఎల్ ఛాంపియన్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. టాప-5 ప్లేయర్ల జాబితాలో ధోని,వార్నర్ లు సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నారు. 

25
Most Player of the Match awards in Indian Premier League history

4. విరాట్ కోహ్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అలాగే, 260 ఐపీఎల్ మ్యాచ్‌లలో 19 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని ఈ లిస్టులో 4వ స్థానంలో ఉన్నాడు. 

35
Most Player of the Match awards in IPL

3. రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 264 మ్యాచ్ లను ఆడి 20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్నాడు. 

45
Most Player of the Match awards in Indian Premier League

2. క్రిస్ గేల్ 

యూనివర్సల్ బాస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 142 మ్యాచ్‌లలో 22 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

55
Image credit: RCB/Facebook

1. ఏబీ డివిలియర్స్

మిస్టర్ 360, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తన 184 ఐపీఎల్ మ్యాచ్‌ల కెరీర్ లో 25 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లను గెలుచుకున్న ప్లేయర్ గా ఏబీడీ నిలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories