రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, ధోనికి 4 కోట్లు - సీఎస్కే రిటైన్ లిస్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే?

First Published | Oct 31, 2024, 11:59 PM IST

IPL 2025 CSK retained players : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలుచుకుని విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా కొన‌సాగుతోంది. వేలం వ్యూహాలతో చాలా స్పష్టంగా ఉండే సీఎస్కే IPL 2025 మెగా వేలానికి ముందు రవీంద్ర జడేజాను మొద‌టి ఎంపిక‌గా రిటైన్ చేసుకుంది. 
 

IPL 2025 CSK Retention, IPL 2025, CSK Retention, CSK

IPL 2025 CSK retained players : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గత ఐదేళ్లలో మిశ్రమ ఫ‌లితాల‌తో ఐపీఎల్ లో ముందుకు సాగుతోంది. వారి ఇటీవలి ప్రదర్శనలను దృష్టిలో ఉంచుకుని సీఎస్కే రాబోయే సీజ‌న్ కోసం రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించింది. గ‌త సీజన్ లో ఎంఎస్ ధోని నుంచి కెప్టెన్సీ ప‌గ్గాలు తీసుకున్న‌ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు రవీంద్ర జడేజా స‌హా మొత్తం ఐదురుగు ప్లేయ‌ర్ల‌ను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. 

ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్ల లిస్టులో రుతురాజ్ గైక్వాడ్, ర‌వీంద్ర జ‌డేజా, శివ‌మ్ దుబే, మ‌తీషా ప‌తిరానాల‌ను రిటైన్ చేసుకుంది. వీరితో పాటు లెజెండ‌రీ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనిని కూడా రిటైన్ చేసుకుంది. అయితే, అన్‌క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ రూల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంతో 43 ఏళ్ల ధోనీని రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది. 

చెన్నై సూప‌ర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్లు వీరే 

రుతురాజ్ గైక్వాడ్ (క్యాప్డ్) - రూ. 18 కోట్లు

రవీంద్ర జడేజా (క్యాప్డ్) - రూ. 18 కోట్లు

మతీషా పతిరణ (క్యాప్డ్, ఓవర్సీస్) – రూ. 13 కోట్లు

శివమ్ దూబే (క్యాప్డ్) - రూ. 12 కోట్లు

ఎంఎస్ ధోని (అన్‌క్యాప్డ్) - రూ. 4 కోట్లు


ఐపీఎల్ వేలం కోసం చెన్నై టీమ్ వ‌ద్ద‌ మిగిలిన మ‌నీ పర్సు : రూ. 55 కోట్లు.

ఈ ఐదు నిలుపుదలలు వారి మొత్తం పర్స్ అయిన రూ. 120 కోట్ల నుండి దాదాపు రూ. 65 కోట్లు ఖ‌ర్చు చేసింది. వేలం కోసం చెన్నై టీమ్ కు ఒక రైట్-టు-మ్యాచ్ (RTM) ఎంపిక ఉంటుంది. దాదాపు స‌గం రిటైన్ ప్లేయ‌ర్ల కోసం ఖ‌ర్చు చెన్నై టీమ్ దాదాపు జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన టాప్ ప్లేయ‌ర్ల‌ను నిలుపుకుంది. 

జడేజా జట్టులోని మరో సీనియర్ ప్లేయ‌ర్.. అత‌ను బ్యాటింగ్, బౌలింగ్ లో అనేక సార్లు స‌త్తా చాటాడు. అయితే, ఇటీవ‌ల అత‌ని ప్ర‌ద‌ర్శ‌న ఆశించిన స్థాయిలో క‌నిపించ‌డం లేదు. అయినప్ప‌టికీ సీఎస్కే జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికీ వారి పాత విన్నింగ్ ప్లేయ‌ర్ పై ఆధారపడినట్లు కనిపిస్తోంది.

ఇక రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కేకు అద్బుత‌మైన ప్లేయ‌ర్ గా ఎదిగాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నుంచి కెప్టెన్సీ ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు. ఇప్ప‌టికే త‌నేంటో నిరూపించుకున్నాడు. స్ట్రైక్-రేట్ 146.67తో శివమ్ దూబే సీఎస్కే కు అత్యంత ప్రీమియర్ పవర్ హిట్ట‌ర్ కాబ‌ట్టి అన్ని జ‌ట్టుతోనే ఉంచుకుంది. 

సీఎస్కే రిటైన్ చేసిన శ్రీలంక స్లింగీ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరనా ఇటీవలి సంవత్సరాలలో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నాడు. సీఎస్కేకు అత్యుత్తమ బౌలింగ్ ఎంపికగా నిలిచాడు. 2022లో అరంగేట్రం చేసినప్పటి నుండి 7.87 ఎకానమీ రేటుతో 34 వికెట్లు తీసుకున్నాడు.

Latest Videos

click me!