IPL 2024: వేలానికి ముందు ఐపీఎల్ జట్లు విడిచిపెట్టిన అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే !

First Published | Nov 28, 2023, 2:22 PM IST

IPL retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మొద‌టి సారి 2024 సీజ‌న్ కు గానూ విదేశాల్లో వేలం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే 10 ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. పలు జట్లు ఖరీదైన ఆటగాళ్లను కూడా వ‌దులుకున్నాయి.
 

Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ కోసం డిసెంబర్ 26న దుబాయ్ లో జరగనున్న ఆటగాళ్ల వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకుని విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ప్లేయర్లను జట్టు నుంచి తప్పించారు.

ఐపీఎల్ మినీ యాక్షన్ కు ముందు వివిధ జట్ల నుంచి మొత్తం 12 మంది ఆటగాళ్లను విడుదల చేశారు. కోల్ క‌తా నైట్ రైడర్స్ అత్యధిక మంది ఆటగాళ్లను విడుదల చేసిన జట్టు. కేకేఆర్ మొత్తం 11 మంది ఆటగాళ్లను కోల్పోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మంది ఆటగాళ్లను వ‌దులుకున్నాయి. 
 

ముంబ‌యి ఇండియ‌న్స్ జ‌ట్టు అంత‌కుముందు, రూ.8 కోట్ల‌తో పేసర్ జోఫ్రా ఆర్చర్, రూ.17.5 కోట్లతో కామెరున్ గ్రీన్ ను కు కొనుగోలు చేసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్ ను రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్ ను స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. వేలానికి ముందు జట్ల నుంచి విడుదలైన స్టార్ ప్లేయర్ శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగను ఆర్సీబీ భారీ ధరకు కొనుగోలు చేసింది.


ముంబై ఇండియన్స్ విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాలో జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టోక్స్, దువాన్ జాన్సెన్, జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్, మహ్మద్ అర్షద్ ఖాన్, రమణ్దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, కామెరున్ గ్రీన్, 

చెన్నై సూపర్ కింగ్స్ విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితాలో.. అంబటి రాయుడు, కైల్ జేమీసన్, సిసంద మగాల, ఆకాశ్ సింగ్, బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, సేనాపతి, భగత్ వర్మ ఉన్నారు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
జోష్ హేజిల్ వుడ్, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్.
 

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్: 

షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీస్, నారాయణ్ జగదీశన్, మన్దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ చార్లెస్.

గుజరాత్ టైటాన్స్: 

ప్రదీప్ సంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ షనక, యశ్ దయాళ్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్.
 

ల‌క్నో సూపర్ జెయింట్స్: 

జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, మనన్ వోహ్రా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్ షెడ్గే, కరుణ్ నాయర్.

ఢిల్లీ క్యాపిటల్స్: 

రిలే రోసోవ్, చేతన్ సకారియా, రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కమలేష్ నాగర్కోటి, రిపాల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియం గార్గ్.

రాజస్థాన్ రాయల్స్: 

జో రూట్, అబ్దుల్ బాసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెద్ మెక్కాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్.

సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్: 

బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకెల్ హుస్సేన్, ఆదిల్ రషీద్

పంజాబ్ కింగ్స్: 

భానుక రాజపక్స, మోహిత్ రాఠీ, బల్తేజ్ దండా, రాజంగద్ బావా, షారుక్ ఖాన్.
 

Latest Videos

click me!