Virat Kohli : వ్యాపారాల్లోనూ విరాట్ రారాజే.. కోహ్లీ పెట్టుబడులు పెట్టిన వ్యాపార సంస్థలు ఇవే.

First Published | Nov 28, 2023, 5:14 AM IST

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఎలా రాణిస్తున్నారో.. అదే రీతిలో బిజినెస్‌లో కూడా రాణిస్తున్నారు. చాలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. విరాట్ కోహ్లీ  నికర విలువ రూ. 1000 కోట్లకు పైగా మాటే.. ఇంతకీ ఏయే స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారో మీరు కూడా ఓ లూక్కేయండి.

 

 
 

Virat Kohli

Virat Kohli: రికార్డుల రారాజు, పరుగుల వీరుడు, ఛేజింగ్ కింగ్‌ కోహ్లీ(Virat Kohli). తన 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో కెప్టెన్ గా, బ్యాట్స్ మెన్ గా అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. ఎవరూ బద్దలు కొట్టలేరనుకున్న రికార్డులను కోహ్లి బద్దలు కొడుతున్నారు. అతడు క్రీజ్ లో ఉన్నంతా సేపు.. ప్రత్యార్థ బౌలర్లను చీల్చి చెండాడుతాడు.  స్కోరు బోర్డును పరిగెత్తిస్తాడంటే.. అతిశయోక్తి కాదు. 

Virat Kohli

టీమిండియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఎలా రాణిస్తున్నారో..  బిజినెస్‌లో కూడా అలాగే రాణిస్తున్నారు. అతడు చాలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. మీడియా నివేదికల ప్రకారం.. విరాట్ కోహ్లీ  నికర విలువ రూ. 1000 కోట్లకు పైగా మాటే. కాగా, కోహ్లి పెట్టుబడి పెట్టిన ఆ స్టార్టప్ కంపెనీల్లేంటీ? ఏయే స్టార్టప్ నుంచి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు.  అంతేకాకుండా.. మాన్యవర్‌తో సహా అనేక ప్రసిద్ధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు ? కోహ్లీ వ్యాపారాలపై మీరు కూడా  ఓ లూక్కేయండి.


Virat Kohli -Blue Tribe

బ్లూ ట్రైబ్ (Blue Tribe): విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఇద్దరూ కలిసి ‘బ్లూ ట్రైబ్’ (Blue Tribe) అనే ఓ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇది భారత ప్లాంట్ బేస్డ్ మీట్ స్టార్టప్.  రేజ్ కాఫీలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బ్రాండ్ అంబాసిడర్లు కూడా. ప్రపంచ వ్యాప్తంగా మాంసం వినియోగించే విధానాన్ని మార్చడానికి బ్లూ ట్రైబ్ ఒక మిషన్‌లో పని చేస్తోంది.

Virat Kohli

రేజ్ కాఫీ (Rage Coffee) : మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ గత సంవత్సరం దేశీ కాఫీ బ్రాండ్ రేజ్ కాఫీలో పెట్టుబడి పెట్టాడు. ఈ ఢిల్లీ ఆధారిత FMCG బ్రాండ్ 2018లో ప్రారంభించబడింది. ఇది దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ స్టోర్‌లను కలిగి ఉంది. స్టార్‌బక్స్, నెస్కేఫ్‌లకు గట్టి పోటీనిస్తోంది. విరాట్ కోహ్లీ పెట్టుబడికి ముందు.. బ్రాండ్ సిరీస్ A ఫండింగ్ నుండి సుమారు $5 మిలియన్లను సేకరించింది.

Virat Kohli

చిసెల్ ఫిట్‌నెస్ (Chisel Fitness): 2015లో విరాట్ కోహ్లీ దేశవ్యాప్తంగా జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి చిసెల్ ఫిట్‌నెస్, CSEతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు. ఈ వ్యాపారంలో కోహ్లి దాదాపు రూ.90 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. సంతోషంగా, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఫిట్‌నెస్ తోడ్పడుతుందని విరాట్ కోహ్లీ చెప్పాడు.

Virat Kohli

యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ (Universal Sportsbiz Pvt Ltd):  విరాట్ కోహ్లీ యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కూడా పెట్టుబడి పెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. విరాట్ కోహ్లీ 2020లో ఈ ఫ్యాషన్ స్టార్టప్‌లో రూ.19.3 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

Virat Kohli

హైపెరిస్( Hyperice): విరాట్ కోహ్లీ 2021లో ప్రఖ్యాత వెల్‌నెస్ బ్రాండ్ అయిన హైపెరిస్‌కు పెట్టుబడిదారుడిగా, బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం ద్వారా కోహ్లి గ్లోబల్ సూపర్‌స్టార్‌లలో స్థానం సంపాదించాడు. గ్లోబల్ సూపర్ స్టార్లు ఎర్లింగ్ హాలాండ్, జా మోరాంట్, నవోమి ఒసాకా, రికీ ఫౌలర్ కూడా దీనితో సంబంధం కలిగి ఉన్నారు. అయితే ఈ కంపెనీలో విరాట్ కోహ్లి ఎంత పెట్టుబడి పెట్టాడన్న దానిపై స్పష్టత లేదు.
 

Virat Kohli

డిజిటల్ ఇన్సూరెన్స్ (Digital Insurance): 2020లో వ్యూహాత్మక ఎత్తుగడలో కోహ్లి, అనుష్క శర్మ దంపతులు కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సాకు చెందిన స్టార్టప్ డిజిటల్ ఇన్సూరెన్స్‌లో రూ. 2.2 కోట్లు పెట్టారు. ఈ స్టార్టప్  మూడేండ్లలోనే $ 84 మిలియన్ల నిధిని సేకరించింది. దీంతో దీని విలువ $ 87 మిలియన్లకు చేరుకుంది.

Latest Videos

click me!