అవును, ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్! 2000 పర్సెంట్ పక్కా... తేల్చి చెప్పేసిన కేదార్ జాదవ్...

Published : Apr 15, 2023, 01:23 PM IST

మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్. ఎందరు కాదన్నా, మహేంద్ర సింగ్ ధోనీ, 2023 సీజన్ తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుబోతున్నాడని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్స్‌ కూడా దీన్ని ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌గా ప్రచారం చేస్తున్నారు...

PREV
16
అవును, ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్! 2000 పర్సెంట్ పక్కా... తేల్చి చెప్పేసిన కేదార్ జాదవ్...
Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహార్ మాత్రం ధోనీకి ఇది ఆఖరి సీజన్ కాదని, అలా ఎవ్వరూ చెప్పలేదని కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ కూడా, మాహీ భాయ్ మరో మూడు సీజన్ల వరకూ ఆడగలడని, అతనికి ఆ ఫిట్‌నెస్ ఉందంటూ వ్యాఖ్యానించాడు...
 

26
(PTI Photo/Kunal Patil)(PTI04_08_2023_000238B)

41 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనీ, క్రీజులో ఉంటే ఐపీఎల్ రియల్ టైం వ్యూస్ రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ క్రీజులో ఉన్న సమయంలో జియోసినిమా యాప్‌లో రియల్ టైం వ్యూస్ 2.2 కోట్ల మార్కును తాకింది...

36

‘అవును, ఎం.ఎస్. ధోనీకి ప్లేయర్‌గా ఇది ఆఖరి సీజన్. 100 శాతం కాదు 2000 శాతం ఇది పక్కా. ఈ విషయాన్ని నేను ఎక్స్‌క్లూజివ్‌గా చెబుతున్నా. ఈ జూలైలో ధోనీకి 42 ఏళ్లు నిండుతాయి..

46
(PTI Photo/R Senthil Kumar)(PTI04_03_2023_000329B)

ఎంత ఫిట్‌గా ఉన్నా అతను కూడా మనిషే కదా. అందుకే ధోనీ, ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడు. అందుకే ఫ్యాన్స్, ధోనీ మ్యాచులను మిస్ కావద్దని అనుకుంటున్నారు. ధోనీ క్రీజులోకి రాగానే ప్రతీ బాల్‌ని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు...

56
Kedar Jadhav

జియో సినిమా యాప్ రికార్డులను ధోనీయే బ్రేక్ చేస్తాడు. ఈసారి ధోనీ బ్యాటింగ్‌కి వస్తే 2.2 కోట్ల రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. మాహీ క్రేజ్ అలాంటిది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ కేదార్ జాదవ్..

66

ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని కేదార్ జాదవ్, 2023 మినీ వేలంలో కూడా రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే షార్ట్ లిస్టులో కేదార్ జాదవ్‌కి చోటు దక్కలేదు. ధోనీకి అత్యంత ఆప్తుడైన జాదవ్, చాలా సందర్భాల్లో మాహీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories