శ్రేయాస్ అయ్యర్‌కి మరో షాక్ తప్పదా? అప్పుడు రిషబ్ పంత్, ఇప్పుడు నితీశ్ రాణా... కేకేఆర్ కెప్టెన్సీ కూడా..

Published : Apr 15, 2023, 12:29 PM IST

రెండేళ్ల క్రిందటి మాట... విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియాని నడిపించే భావి సారథిగా రేసులో నిలిచిన ఒకే ఒక్కడు శ్రేయాస్ అయ్యర్. అంతా సజావుగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో ఓ గాయం, అయ్యర్ కెరీర్‌కి మలుపు తిప్పింది... అప్పటి నుంచి అయ్యర్ కెరీర్‌ గ్రాఫ్, కిందికే పోతోంది..

PREV
18
శ్రేయాస్ అయ్యర్‌కి మరో షాక్ తప్పదా? అప్పుడు రిషబ్ పంత్, ఇప్పుడు నితీశ్ రాణా... కేకేఆర్ కెప్టెన్సీ కూడా..

2021 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఆరు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమయ్యాడు. దీంతో తాత్కాలిక సారథిగా రిషబ్ పంత్‌ని ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్...

28
Shreyas Iyer-Rishabh Pant

టెంపరరీ కెప్టెన్‌గా వచ్చిన రిషబ్ పంత్, తన కెప్టెన్సీతో టీమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంప్రెస్ చేశాడు. దీంతో అంతకుముందు 2020 సీజన్‌లో టీమ్‌ని మొట్టమొదటిసారి ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌ని పక్కనబెట్టి, రిషబ్ పంత్‌ని కెప్టెన్‌గా కొనసాగించింది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో మరో మార్గం లేక ఆ టీమ్ నుంచి బయటికి వచ్చేశాడు శ్రేయాస్ అయ్యర్...

38
Image credit: PTI

ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని రూ.12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... అయ్యర్ కెప్టెన్సీలో 14 మ్యాచులు ఆడిన కేకేఆర్, 6 మ్యాచులు నెగ్గి 8 మ్యాచుల్లో ఓడింది. మొత్తంగా 7వ స్థానంలో నిలిచి, ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది..

48

ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు మళ్లీ శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు. ఈ సారి అయ్యర్ ప్లేస్‌లో నితీశ్ రాణా టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. రాణా కెప్టెన్సీలో మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడిన కేకేఆర్, ఆ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది...

58

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌ని చివరి బంతికి గెలిచింది. గత సీజన్‌లో కంటే ఈసారి కేకేఆర్ పర్ఫామెన్స్ టాప్ క్లాస్‌గా ఉంది...

68

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ 23 పరుగుల తేడాతో ఓడినా కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ కారణంగా ఆఖరి ఓవర్ వరకూ పోరాడింది. గెలిచిన సన్‌రైజర్స్ కంటే ఓడినా తన పోరాటంతో ఎక్కువగా ఇంప్రెస్ చేసింది కోల్‌కత్తా..

78
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000334B)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ 23 పరుగుల తేడాతో ఓడినా కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్ కారణంగా ఆఖరి ఓవర్ వరకూ పోరాడింది. గెలిచిన సన్‌రైజర్స్ కంటే ఓడినా తన పోరాటంతో ఎక్కువగా ఇంప్రెస్ చేసింది కోల్‌కత్తా..

88

లూకీ ఫర్గూసన్, ఆండ్రే రస్సెల్ కూడా ఫామ్‌లోకి వస్తే కోల్‌కత్తాని నిలువరించడం చాలా కష్టమైపోతుంది. దీంతో మరోసారి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ సీటుకి బొక్క పడేలానే కనిపిస్తోంది. ఒకవేళ నితీశ్ రాణా, కేకేఆర్ టీమ్‌ని ఈసారి ప్లేఆఫ్స్‌కి చేరినా, లక్కీగా ఫైనల్ చేర్చినా... అయ్యర్ వచ్చినా అతనికి కెప్టెన్సీ ఇచ్చేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపించకపోవచ్చు.. 

click me!

Recommended Stories