ఆ టీమ్స్‌ని భయపెడుతున్న హోం గ్రౌండ్స్ సెంటిమెంట్... ఐపీఎల్ 2023లో వరుసగా ఐదు మ్యాచుల్లో అదే రిజల్ట్...

Published : Apr 15, 2023, 01:03 PM IST

మూడు సీజన్ల తర్వాత ఐపీఎల్ 2023 సీజన్ మళ్లీ హోం, Away పద్ధతిలో జరుగుతోంది. మొదటి వారం హోం గ్రౌండ్‌లో మ్యాచులు జరిగిన టీమ్స్‌కి విజయాలు దక్కితే (ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప), రెండో వారం సీన్ రివర్స్ అయ్యింది...

PREV
18
ఆ టీమ్స్‌ని భయపెడుతున్న హోం గ్రౌండ్స్ సెంటిమెంట్... ఐపీఎల్ 2023లో వరుసగా ఐదు మ్యాచుల్లో అదే రిజల్ట్...
Image credit: PTI

మొదటి వారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, లక్నోలో జరిగిన మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్, బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ, చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయాలు అందుకున్నాయి. ఒక్క సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే సొంత గ్రౌండ్‌లో జరిగిన మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోయాయి...

28

రెండో వారంలో మాత్రం టీమ్స్‌కి హోం గ్రౌండ్ కలిసి రావడం లేదు. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతుల్లో చిత్తుగా ఓడింది ముంబై ఇండియన్స్.. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ చేతుల్లో 3 వికెట్ల తేడాతో ఓడింది..

38
Image credit: PTI

బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీపై ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది. అలాగే ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ని ఓడించి, సీజన్‌లో తొలి విజయం అందుకుంది ముంబై ఇండియన్స్...

48
(PTI Photo)(PTI04_08_2023_000200B)

చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది రాజస్థాన్ రాయల్స్. అలాగే మోహాలీలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్...

58

తాజాగా కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో నైట్ రైడర్స్‌పై 23 పరుగుల తేడాతో నెగ్గింది సన్‌రైజర్స్ హైదరాబాద్. సొంత మైదానాల్లో జరుగుతున్న మ్యాచ్‌లు, టీమ్స్‌కి కలిసి రావడం లేదు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు...

68
Image credit: PTI

మొదటి మ్యాచ్‌లో ఘన విజయం అందుకున్న తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, నేడు బెంగళూరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఇప్పటిదాకా సీజన్‌లో మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీకి ఈ సెంటిమెంట్ కలిసి వస్తే, బోణీ కొట్టడం ఖాయం..

78
(PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000356B)

అదే జరిగితే ఆర్‌సీబీ హ్యాట్రిక్ ఓటములను చవి చూడాల్సి ఉంటుంది. అలాగే లక్నోలో పంజాబ్ కింగ్స్‌తో తలబడుతోంది సూపర్ జెయింట్స్. వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి, తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిన పంజాబ్ కింగ్స్‌కి ఈ మ్యాచ్‌లో విజయం చాలా అవసరం..

88
rajasthan royals

అలాగే ఆదివారం ముంబైలో కేకేఆర్‌తో మ్యాచ్ ఆడనుంది ముంబై ఇండియన్స్. ఢిల్లీని ఓడించి తొలి విజయం అందుకున్న ముంబైని ఈ సెంటిమెంట్ కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. అలాగే అహ్మదాబాద్‌లో గత సీజన్ ఫైనలిస్టులు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 

click me!

Recommended Stories