టోర్నీలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సీఎస్కే సారథి ధోని ఆడతాడా..? లేదా..? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. రెండ్రోజుల క్రితం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ధోని ఎడమ మోకాలికి గాయమైందని, అతడు గుజరాత్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నా చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వనాథ్ మాత్రం వీటిని ఖండించాడు.