టీమిండియాకి ఆడినప్పుడు అజింకా రహానేని ఎందుకు తీసేశావ్... ధోనీపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...

First Published Apr 10, 2023, 11:43 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఊహించని ఇన్నింగ్స్‌తో హాట్ టాపిక్ అయ్యాడు అజింకా రహానే. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అజింకా రహానే, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఘన విజయాన్ని అందించాడు...
 

సీఎస్‌కే ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి ఫుడ్‌ పాయిజిన్ కావడంతో టాస్‌కి ముందు తాను ఆడబోతున్నట్టు చెప్పారని స్వయంగా వెల్లడించాడు అజింకా రహానే. కెరీర్ ఎండింగ్ స్టేజీలో రహానేని ఆడించి, అతని నుంచి సెన్సేషనల్ ఇన్నింగ్స్ రాబట్టిన ఎమ్మెస్ ధోనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది..
 

ఐపీఎల్‌లో ఎవరు బాగా ఆడినా దానికి క్రెడిట్ మహేంద్ర సింగ్ ధోనీకి అట్టకట్టడం మాహీ ఫ్యాన్స్‌కి బాగా అలవాటు. అజింకా రహానే ఇన్నింగ్స్ కూడా మాహీ చలవే అంటున్నారు. ధోనీ కూడా మ్యాచ్ అనంతరం రహానే ఇన్నింగ్స్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు...
 

Latest Videos


‘మ్యాచ్‌కి ముందు నేను, రహానేతో మాట్లాడాను. నీ బలాన్ని వాడి, నీకు నచ్చినట్టుగా ఫ్రీగా ఆడమని చెప్పాను. వెళ్లి నీ ఆటను ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చాను. ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నాను. మొదటి మ్యాచ్‌లో అతన్ని ఆడించకపోవచ్చు కానీ అవకాశం వచ్చినప్పుడు అందరికీ ఛాన్స్ ఇస్తామని చెప్పాను...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.. 
 

అయితే ధోనీ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. 2018 వరకూ టీమిండియాకి వన్డే, టీ20ల్లో రెగ్యూలర్ ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉన్న అజింకా రహానే, ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో చోటు కోల్పోయాడు. విరాట్ కోహ్లీ మాత్రం అజింకా రహానేని టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా కొనసాగిస్తూ వచ్చాడు...

‘ఐపీఎల్‌ టీమ్‌లో అజింకా రహానేని ఆడించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఎందుకుని అతన్ని టీమిండియాలో ఆడించలేదు..  ప్లేయర్లకు కాన్ఫిడెన్స్ చాలా అవసరం.  చెన్నై సూపర్ కింగ్స్‌లో ప్లేయర్లకు ధోనీ పూర్తి భరోసా ఇచ్చి ఫ్రీగా ఆడేలా ప్రోత్సహిస్తున్నానని చెబుతున్నాడు.. 
 

Ajinkya Rahane

మరి అదే పని టీమిండియాలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు. నేను కెప్టెన్ ధోనీని ఇదే అడగాలని అనుకుంటున్నా. భారత జట్టుకి కెప్టెన్‌గా ఉన్నప్పుడు వన్డేల్లో నుంచి అజింకా రహానేని తొలగించాడు ధోనీ. అతను స్లోగా ఆడుతున్నాడని, స్ట్రైయిక్ రొటేట్ చేయడం లేదని రహానేకి టీమ్‌లో చోటు లేకుండా చేశాడు..

dhoni review

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడేందుకు అడ్డురాని స్ట్రైయిక్ రేటు, టీమిండియాలో ఆడేందుకు అడ్డు వచ్చిందా? ఇప్పుడు మోటివేట్ చేసినట్టే, అప్పుడు టీమిండియా తరుపున ఆడినప్పుడు మోటివేట్ చేసి ఉంటే... రహానే నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు వచ్చేవి కదా...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..

అయితే సెహ్వాగ్ వ్యాఖ్యల్లో లాజిక్ ఉన్నా, ధోనీ కెప్టెన్సీ చేసిన టీ20, వన్డే మ్యాచులో కూడా అజింకా రహానే ఆడాడు. ధోనీ కెప్టెన్సీలో ఆడిన టీ20 వరల్డ్ కప్ 2016 సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై ఆఖరి టీ20 ఆడాడు అజింకా రహానే.. ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నా, 2019 వరకూ అతనే ఆన్ ఫీల్డ్ కెప్టెన్‌గా టీమ్‌ని డిసైడ్ చేసేవాడని అందరికీ తెలిసిన విషయమే...

click me!