కమ్‌బ్యాక్ నామ సీజన్‌గా ఐపీఎల్ 2023... అజింకా రహానే, విజయ్ శంకర్, అయ్యర్, శార్దూల్, శిఖర్...

Published : Apr 10, 2023, 10:45 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఘనంగా మొదలైంది. మొదటి వారం మ్యాచులు కొన్ని చప్పగా, మరికొన్ని వన్‌సైడెడ్‌గా జరిగాయి. ఐపీఎల్ ఎల్ క్లాసికోగా పేరొందిన సీఎస్‌కే, ముంబై మ్యాచ్ కూడా బోర్ కొట్టించింది. అయితే కొన్ని మ్యాచులు క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్కుని అందించాయి...  

PREV
17
కమ్‌బ్యాక్ నామ సీజన్‌గా ఐపీఎల్ 2023... అజింకా రహానే, విజయ్ శంకర్, అయ్యర్, శార్దూల్, శిఖర్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో గత రెండు రోజుల్లో జరిగిన మ్యాచుల్లో సీనియర్ ప్లేయర్లు సత్తా చాటి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఎవ్వరూ ఊహించనట్టుగా, ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు... బ్యాటుతో, బాల్‌తో మెరిసి మ్యాజిక్ చూపించారు. దీంతో 2023 సీజన్‌ని కమ్‌బ్యాక్ ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు...
 

27
Ajinkya Rahane

అజింకా రహానే: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సమవుజ్జీగా టీమిండియాలో వెలుగొందిన అజింకా రహానే, 2022 నుంచి టీమిండియాలో చోటు కోల్పోయాడు. 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రహానేని పక్కనబెట్టగా 2022 సీజన్ మధ్యలో రహానే గాయపడి, టీమ్‌కి దూరమయ్యాడు. బేస్ ప్రైజ్‌కి సీఎస్‌కేలోకి వచ్చిన రహానే, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 19 మ్యాచుల్లో చెలరేగాడు. 225.93 స్ట్రైయిక్ రేటుతో 61 పరుగులు చేసిన రహానే, 2023 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

37

విజయ్ శంకర్: 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్‌కి దూరమైన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్. 2019 నుంచి 2021 వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో ఉన్న విజయ్ శంకర్, ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప మిగిలిన అన్ని మ్యాచుల్లో రెగ్యూలర్‌గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. గత సీజన్‌లో కూడా ఫెయిల్ అయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ విజయ్ శంకర్, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.. 

47

వెంకటేశ్ అయ్యర్: ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో వెలుగులోకి వచ్చిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్. కేకేఆర్‌ని ఒంటి చేత్తో ప్లేఆఫ్స్ చేర్చిన అయ్యర్, ఫైనల్ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ చేసి ఒంటరిపోరాటం చేశాడు. ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న అయ్యర్, పెద్దగా ఆకట్టుకోలేక టీమ్‌కి దూరమయ్యాడు. శుబ్‌మన్ గిల్‌ని వదిలేసి వెంకటేశ్ అయ్యర్‌ని రిటైన్ చేసుకుంది కేకేఆర్. అయితే గత సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన వెంకటేశ్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు..

57
Image credit: PTI

శార్దూల్ ఠాకూర్:  పేలవ ఫామ్‌తో మూడు ఫార్మాట్లలో టీమ్‌కి దూరమైన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. 2021 బ్రిస్బేన్ టెస్టులో సంచలన పర్ఫామెన్స్ ఇచ్చి, టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిన శార్దూల్, 2022-23 ఏడాదిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసి అదరగొట్టాడు శార్దూల్ ఠాకూర్...

67
(PTI Photo) (PTI04_05_2023_000367B)

శిఖర్ ధావన్: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ ప్లేయర్ల కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు శిఖర్ ధావన్. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున సంచలన ప్రదర్శన ఇస్తున్నాడు ధావన్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసిన శిఖర్ ధావన్, టీమ్‌ స్కోరులో 70 శాతం పరుగులు చేశాడు.. 15వ ఓవర్‌లో 9వ వికెట్ కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత 5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో నాన్ స్ట్రైయికర్ మోహిత్ రతే ఆడింది రెండే బంతులు, చేసింది ఒకే పరుగు. అంటే ధావన్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో అర్థం చేసుకోవచ్చు..

77
Mayank Markande

మయాంక్ మర్కండే: 2018లో ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన మయాంక్ మర్కండే, ఐపీఎల్‌లో తీసిన మొదటి వికెట్ ఎం.ఎస్. ధోనీది.  ఆ సీజన్‌లో 15 వికెట్లు తీసిన మయాంక్ మర్కండే, 2019 సీజన్‌లో గాయంతో 3 మ్యాచులే ఆడాడు. ఆ తర్వాత 2020 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్, 2021 సీజన్‌లో ఒకటి, 2022లో 2 మ్యాచులు ఆడాడు. ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు మయాంక్ మర్కండే..

click me!

Recommended Stories