3 రోజుల క్రితం రింకూ సింగ్‌ని ట్రోల్ చేసిన యశ్ దయాల్... బ్యాటుతో రిప్లై ఇచ్చిన కేకేఆర్ బ్యాటర్..

Published : Apr 10, 2023, 09:50 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌లో ఛేదించి, టైటాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చింది కేకేఆర్...

PREV
110
3 రోజుల క్రితం రింకూ సింగ్‌ని ట్రోల్ చేసిన యశ్ దయాల్... బ్యాటుతో రిప్లై ఇచ్చిన కేకేఆర్ బ్యాటర్..
Rinku Singh

గుజరాత్ టైటాన్స్ తరుపున సాయి సుదర్శన్ 53, విజయ్ శంకర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేసి అదరగొట్టగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు..

210
Rashid Khan

చివరి 5 ఓవర్లలో కేకేఆర్ విజయానికి 56 పరుగులే కావాల్సి రావడంతో టైటాన్స్ ఓటమి ఖాయమనుకున్నారంతా. అయితే రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసి మ్యాచ్‌ని మలుపు తిప్పాడు... డేంజరస్ బ్యాటర్లు ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ వెంటవెంటనే అవుట్ అయ్యారు...

310

అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో చివరి 8 బంతుల్లో విధ్వంసం క్రియేట్ చేశాడు రింకూ సింగ్. 19వ ఓవర్‌ ఆఖరి 2 బంతుల్లో 6, 4 బాదిన రింకూ సింగ్.. చివరి ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఛేజింగ్‌లో చివరి ఓవర్‌లో చేసిన అత్యధిక పరుగులు ఇవే...

410
Image credit: PTI

తొలి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్ తీయడం, చివరి 5 బంతుల్లో కేకేఆర్ విజయానికి 28 పరుగులు కావాల్సి ఉండడంతో గుజరాత్ టైటాన్స్, గెలిచేశామని ఫిక్స్ అయిపోయింది. అయితే రింకూ సింగ్... అసాధ్యమనుకున్నదాన్ని సాధ్యం చేసి చూపించాడు...

510

బాల్ ఎలాంటిదైనా, వేగం ఎంతైనా, లెంగ్త్ ఏదైనా పట్టించుకోకుండా బౌండరీ అవతల పడేశాడు. ఫలితంగా చివరి ఓవర్ వేసిన యష్ దయాల్, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బౌలర్‌గా చెత్త రికార్డు నెలకొల్పాల్సి వచ్చింది..

610
Image credit: PTI

ఇంతకుముందు 2018లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బాసిల్ తంపి 70 పరుగులు సమర్పించగా యష్ దయాల్, 69 పరుగులు ఇచ్చేశాడు. ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన ఐదో బ్యాటర్ రింకూ సింగ్. ఇంతకుముందు క్రిస్ గేల్, రాహుల్ తెవాటియా, రవీంద్ర జడేజా, మార్కస్ స్టోయినిస్ ఈ ఫీట్ సాధించారు..
 

710

రింకూ సింగ్ అలా సిక్సర్లు బాదుతుంటే ఏం జరుగుతుందో తెలియక మ్యాచ్ ముగిసిన తర్వాత కళ్లకు బ్యాండ్ పెట్టుకున్నాడు యశ్ దయాల్. అయితే సరిగ్గా 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో రింకూ సింగ్‌ని ట్రోల్ చేశాడు సదరు యశ్ దయాల్...

810
Image credit: PTI

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రింకూ సింగ్. ఈ మ్యాచ్ గురించి రింకూ సింగ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా దానికి ‘బిగ్ ప్లేయర్ రింకూ’ అంటూ కామెంట్ చేశాడు యష్ దయాల్...

910

ఎన్నో సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నా రింకూ సింగ్‌కి సరైన అవకాశాలు వచ్చింది చాలా తక్కువ. గత సీజన్‌లోనే రింకూ సింగ్‌కి వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించింది కేకేఆర్. ఈసారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు రింకూ సింగ్...
 

1010

తనను ‘బిగ్ ప్లేయర్’ అంటూ వ్యంగ్యంగా యష్ దయాల్ ట్రోల్ చేశాడని తెలిసినా, రింకూ సింగ్.. ‘హై ఫై’ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. 3 రోజుల తర్వాత సరిగ్గా యష్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్లు బాది, సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. 

click me!

Recommended Stories