రింకూ నువ్వు తోపు.. అతడు క్రీజులో ఉంటే ఎంతటి బౌలర్‌కైనా హడలే..

Published : May 21, 2023, 01:29 PM IST

IPL 2023: ఐపీఎల్  ప్రతీ సీజన్  ఓ కొత్త హీరోను   పరిచయం చేస్తోంది. ఈ సీజన్ లో  ఆ జాబితాలోకి వచ్చిన  ప్లేయర్ రింకూ సింగ్.  

PREV
15
రింకూ నువ్వు తోపు.. అతడు క్రీజులో ఉంటే ఎంతటి బౌలర్‌కైనా హడలే..

తన అసాధారణ ఆటతీరుతో  దిగ్గజ జట్లకు కూడా  చెమటలు పట్టిస్తున్నాడు   కోల్కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్.  ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ వేదికగా  ముగిసిన మ్యాచ్ లో  చివరి  ఓవర్లో ఐదు సిక్సర్లు బాది  రాత్రికి రాత్రి హీరో అయిపోయిన  రింకూ.. శనివారం  లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో  కూడా కేకేఆర్ ను గెలిపించినంత పని చేశాడు. 

25
Image credit: PTI

లక్నో నిర్దేశించిన  177 పరుగుల లక్ష్య ఛేదనలో  నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రింకూ.. 33 బంతుల్లోనే  6 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో   67 పరుగులు చేశాడు.  రింకూ  విధ్వంసంతో    ఆఖరి ఓవర్లో  21 పరుగులు చేయాల్సిన   కేకేఆర్..  20 పరుగుల వద్దే ఆగిపోయింది.  లాస్ట్ 2 ఓవర్స్ లో   39 పరుగులు రాబట్టిన రింకూపై  ప్రశంసల వెల్లువ కురుస్తోంది. 

35

రింకూపై సొంత టీమ్ కు చెందిన ఆటగాళ్లే కాకుండా ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు కూడా  ప్రశంసలు కురిపిస్తున్నారు.   నిన్నటి మ్యాచ్ ముగిశాక  లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా  స్పందిస్తూ.. ‘ఈ ఏడాది రింకూ  చాలా స్పెషల్ గా ఆడాడు.  రింకూ క్రీజులో ఉంటే  మ్యాచ్ ను ఈజీగా  తీసుకునే వీలులేని పరిస్థితిని కల్పించాడు.  ఇవాళ కూడా అదే రిపీట్ అయింది..’అని కొనియాడాడు. 

 

45

ఇక  కేకేఆర్ కు రెండు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన  గౌతం గంభీర్ కూడా మ్యాచ్ ముగిశాక రింకూ, నితీశ్ రాణా, సుయాశ్ శర్మలతో ప్రత్యేకంగా ముచ్చటించాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విటర్  లో షేర్ చేస్తూ..  ‘ఇవాళ రింకూ సింగ్ అద్భుతంగా పోరాడాడు.   సెన్సేషనల్ టాలెంట్..’అని ట్వీట్ చేశాడు. 

55

రెండ్రోజుల క్రితం  టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్  సింగ్ కూడా రింకూ పై  ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ షో లో భజ్జీ మాట్టాడుతూ .. ‘ఇప్పుడు కేకేఆర్ కు రింకూ సింగే ఎక్స్ ఫ్యాక్టర్.  రసెల్ కాదు. రసెల్ యుగం ముగిసింది.   ఇప్పుడు రింకూ  టైమ్. రింకూను    ఫినిషర్ గానే కాక   బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపినా అతడు ఆ రోల్  కు న్యాయం చేస్తాడు.  రింకూ టాలెంట్ వేరే లెవల్ అంతే.  త్వరలోనే అతడు భారత జట్టు తరఫున ఆడతాడన్న నమ్మకం నాకుంది..’ అని  చెప్పాడు. 

 

click me!

Recommended Stories