ప్లానూ లేదు! పాడు లేదు... అలా అనుకోకుండా కలిసి వచ్చింది! సన్‌రైజర్స్‌పై విజయంపై కెఎల్ రాహుల్...

Published : Apr 08, 2023, 03:59 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్, రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓడింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని చిత్తు చేసి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది...

PREV
17
ప్లానూ లేదు! పాడు లేదు... అలా అనుకోకుండా కలిసి వచ్చింది! సన్‌రైజర్స్‌పై విజయంపై కెఎల్ రాహుల్...
Image credit: PTI

పిచ్ చూసి, బ్యాటింగ్‌కి బాగా కలిసి వస్తుందని భావించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి 9 మ్యాచుల్లో టాస్ గెలిచిన కెప్టెన్లు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ తీసుకుంటే, మార్క్‌రమ్ మామ మాత్రం భిన్నంగా ఆలోచించాడు. ఇదే ఆరెంజ్ ఆర్మీ కొంప ముంచింది...

27
(PTI Photo/R Senthil Kumar)(PTI04_03_2023_000257B)

మూడో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన కృనాల్ పాండ్యా, 3 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్‌ని కాకవికలం చేశాడు. ఆ తర్వాత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ ఆశలపై నీళ్లు పోశాడు... 

37

స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై మనవాళ్లు ఇబ్బంది పడ్డట్టే లక్నో బ్యాటర్లు కూడా తడబడతారేమోనని అనుకుంటే, అలాంటిదేమీ జరగలేదు. 122 పరుగుల ఈజీ టార్గెట్‌ని కేవలం 16 ఓవర్లలోనే ఛేదించి పడేసింది లక్నో సూపర్ జెయింట్స్...
 

47
Krunal and KL Rahul

‘నిజానికి సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సమయంలో పిచ్ ఎలా ఉంటుందనే విషయంపై మాకు ఎలాంటి అంచనా లేదు. కొన్ని వారాలుగా ఇదే పిచ్‌పై ప్రాక్టీస్ చేస్తున్నాం. దాంతో స్పిన్‌కి సహకరిస్తుందనే విషయాన్ని గ్రహించాం. మొదటి రెండు ఓవర్లు అయిన తర్వాత నాకే ఎందుకో స్పిన్ ట్రై చేద్దామని అనిపించింది..

57


నిజం చెప్పాలంటే స్పిన్ బౌలింగ్‌ని పవర్ ప్లేలో తీసుకురావాలని మేం ప్లాన్ చేయలేదు. జయ్‌దేవ్ కొన్ని కట్టర్స్ వేసిన తర్వాత కృనాల్ పాండ్యాకి బంతిని అందించా. మార్క్ వుడ్, ఆవేశ్ ఖాన్ ఇద్దరూ లేకపోవడంతో స్పిన్నర్లతోనే స్కోరుని కంట్రోల్ చేద్దామని అనుకున్నా..
 

67
Source: PTI

అయితే అనుకోకుండా పిచ్ నుంచి స్పిన్నర్లకు మంచి సహకారం లభించింది. వాస్తవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంత తక్కువ స్కోరు చేస్తారని అస్సలు ఊహించలేదు. కనీసం 170 స్కోరు ఉంటుందని అనుకున్నాం. టాస్ ఓడాక తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తోంది..
 

77
Image credit: PTI

ప్రతీ ఒక్కరికీ ఓ భిన్నమైన బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది. కొన్ని రోజులుగా టీమ్‌లో ఉన్న మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్కో మ్యాచ్‌పై ఫోకస్ పెడుతూ వెళ్తున్నాం. చెన్నైతో మ్యాచ్‌లో ఓడినా ఆఖరి వరకూ పోరాడగలిగాం. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది...’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్..

click me!

Recommended Stories