వన్‌డౌన్‌లో వచ్చిన గౌతమ్ గంభీర్ 69 పరుగులు చేసినా, యువరాజ్ సింగ్ 12, ధోనీ 12, విరాట్ కోహ్లీ 1, హర్భజన్ 3 పరుగులు చేయగా యూసఫ్ పఠాన్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, మునాఫ్ పటేల్ డకౌట్ కావడంతో టీమిండియా 48.4 ఓవర్లలో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది సౌతాఫ్రికా. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకి ఎదురైన ఏకైక పరాజయం ఇదే..