ధోనీ ఫ్యాన్స్ దెబ్బకు రికార్డులు బ్రేక్ చేస్తున్న ఐపీఎల్ 2023 సీజన్... అటు ఆర్‌సీబీ, ఇటు ధోనీ...

First Published Apr 13, 2023, 11:18 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి ఆశించిన స్థాయిలో వ్యూయర్‌షిప్ రాలేదు. అయితే 2023 సీజన్ మాత్రం సూపర్ హిట్ దిశగా సాగుతోంది. కారణం ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్కో మ్యాచ్ గడిచే కొద్దీ వ్యూయర్‌షిప్ రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతుండడమే. కోహ్లీ రికార్డును ధోనీ, మాహీ రికార్డును ఆర్‌సీబీ లేపేస్తే.. మళ్లీ ధనాధన్ ధోనీ తన రికార్డును సొంతం చేసుకున్నాడు...
 

(PTI PhotoShailendra Bhojak)(PTI04_10_2023_000179B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జియో సినిమా యాప్‌లో రియల్ టైం వ్యూస్ 1.6 కోట్లను తాకాయి. అప్పటిదాకా అదే అత్యధికం... అయితే ఈ రికార్డు ఒక్క రోజు కూడా నిలవలేదు...

Image credit: PTI

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్ వుడ్ బౌలింగ్‌లో 3 బాల్స్ ఆడిన ధోనీ, 2 సిక్సర్లు బాది అవుట్ అయ్యాడు. ధోనీ క్రీజులోకి రాగానే ఒక్క సారిగి జైమంటూ లేచిన రియల్ టైం వ్యూస్ 1.7 కోట్ల మార్కును తాకాయి. విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేశాడు మహేంద్రుడు...

Latest Videos


rcb fans

ఆ తర్వాత లాస్ట్ బాల్ థ్రిల్లింగ్ మ్యాచులు చాలానే జరిగినా ధోనీ రికార్డు మాత్రం బ్రేక్ కాలేదు. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ రిజల్ట్ ఆఖరి ఓవర్‌లో తేలింది. లాస్ట్ బాల్ థ్రిల్లర్‌ చూడడానికి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపించారు. దీంతో జియో సినిమా యాప్‌లో రియల్ టైం వ్యూస్ 1.8 కోట్ల మార్కును తాకింది. ధోనీ రికార్డును ఆర్‌సీబీ బ్రేక్ చేసింది...

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000329B)

తాజాగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 21 పరుగులు కావాల్సి వచ్చాయి. అప్పటికే సమయం 11 దాటేసిననా రియల్ టైం వ్యూస్ భారీగా పెరిగి 2 కోట్ల మార్కును తాకాయి...

(PTI PhotoR Senthil Kumar)(PTI04_12_2023_000360B)
సందీప్ శర్మ బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఈ సిక్సర్ల దెబ్బకు రియల్ టైం మరింత పెరిగి 2.2 కోట్ల మార్కును తాకింది. అప్పటికే సమయం 11 గంటల 30 నిమిషాలు. ఆ టైంలో ఈ రేంజ్ వ్యూస్ రావడం చాలా పెద్ద విశేషమే.. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ధోనీ..

ఐపీఎల్ 2019 సీజన్‌ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రియల్ టైం వ్యూస్ అత్యధికంగా 18 మిలియన్లను తాకింది. డిస్నీ ప్లస్ హట్ స్టార్‌లో ఇదే అత్యధికం. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మ్యాచులు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనసరి. జియో సినిమా ఫ్రీగా మ్యాచులను టెలికాస్ట్ చేస్తోంది..

జియో సినిమా ఫ్రీ దెబ్బకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రియల్ టైం వ్యూస్ రికార్డు కూడా మొదటి క్వార్టర్‌లోనే బ్రేక్ అయిపోయింది. మున్ముందు ప్లేఆఫ్స్ రేసు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్స్, ఫైనల్ మ్యాచులు ఉండడంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో సరికొత్త రికార్డులు నమోదు కావడం గ్యారెంటీ.. 
 

click me!