ఐపీఎల్ అంటార్రా బాబు... ఊహించని ట్విస్టులు, లాస్ట్ ఓవర్ థ్రిలర్స్, ఆఖరి బంతి వరకూ...

First Published Apr 13, 2023, 1:00 PM IST

క్రికెట్ లీగ్‌ల్లో తోపు ఐపీఎల్. బిగ్ బాష్ లీగ్, పాక్ సూపర్ లీగ్, కరేబియన్ సూపర్ లీగ్.. ఇలా ఎన్ని ఫ్రాంఛైజీ లీగ్‌లు పుట్టుకొచ్చినా, ఐపీఎల్ క్రేజ్‌ని మ్యాచ్ చేయలేకపోయాయి. మిగిలిన లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్‌ ఎందుకంత స్పెషల్. కేవలం డబ్బులు ఎక్కువగా పోవడం వల్లే ఇంత సక్సెస్ వచ్చిందా?...

(PTI PhotoR Senthil Kumar)(PTI04_12_2023_000360B)

ఐపీఎల్‌ సూపర్ సక్సెస్‌కి కారణం డబ్బులు మాత్రమే కాదని, మరోసారి ప్రపంచానికి నిరూపితమైంది. క్రికెట్ ఫ్యాన్స్ కోరుకునే మజా, ఐపీఎల్‌లో టన్నుల్లో ఉంటుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ క్రికెట్ ఫ్యాన్స్‌కి టన్నుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్యాక్ చేసి ఇస్తున్నాయి మ్యాచులు.. 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000330B)

అసలు సిసలైన టీ20 మజాను అందిస్తూ ఆఖరి ఓవర్ వరకూ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచులు, సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 సీజన్ పీక్ స్టేజీకి చేరుకుంది...

Latest Videos


(PTI PhotoKunal Patil)(PTI03_31_2023_000264B)

ఆఖరి ఓవర్‌లో 29 పరుగుల టార్గెట్ ఉండడంతో కేకేఆర్ ఓటమి ఖాయమనుకున్నారంతా. అయితే రింకూ సింగ్ వరుసగా 5 సిక్సర్లు బాది, థ్రిల్లర్ మూవీకి ఎవ్వరూ ఊహించని ముగింపు ఇచ్చాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ వరకూ వెళ్లింది...

Image credit: PTI

212 పరుగుల భారీ స్కోరు చేసినా, వింటేజ్ ఆర్‌సీబీ బౌలింగ్ దెబ్బకు ఆ టార్గెట్‌ని ఆఖరి బంతికి ఛేదించేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కూడా పూర్తిగా 40 ఓవర్ల పాటు సాగింది. చివరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయానికి 5 పరుగులు కావాల్సి వచ్చాయి..
 

Image credit: PTI

ఒక్క సిక్సర్ కొడితే మ్యాచ్ ముగిసిపోయేది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆన్రీచ్ నోకియా సూపర్ బౌలింగ్ స్పెల్‌తో చివరి బంతి వరకూ వెళ్లిన మ్యాచ్‌లో లక్ కలిసి రావడంతో ముంబై ఇండియన్స్‌కి విజయం దక్కింది. డేవిడ్ వార్నర్ త్రో సరిగ్గా వేసి ఉంటే మ్యాచ్ టైగా ముగిసి, ఐపీఎల్ 2023 సీజన్‌లో మొట్టమొదటి సూపర్ ఓవర్ మ్యాచ్ చూసే అవకాశం ఉండేది..
 

రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా బెస్ట్ థ్రిల్లర్ మూవీకి తక్కువేమీ కాదు. చివరి 3 బంతుల్లో 7 పరుగులు చేయలేకపోయిన చెన్నై, 3 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో చివరి బంతి ఆడిన ధోనీ, ఫోర్ బాది ఉంటే ‘సూపర్’ ఓవర్‌లో ఫలితం తేలి ఉండేది...

(PTI Photo) (PTI04_09_2023_000374B)

అయితే 2021 సీజన్‌ తర్వాత ఐపీఎల్‌లో సూపర్ ఓవర్ మ్యాచులు కనిపించడం లేదు. 2020 సీజన్‌లో ఏకంగా ఒకటికి నాలుగు సూపర్ ఓవర్ మ్యాచులు జరిగాయి. 2021 సీజన్ సెకండ్ ఫేజ్‌లో ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. 2022 సీజన్‌లో కానీ, 2023 సీజన్‌లో కానీ ఇప్పటిదాకా ‘సూపర్’ ఓవర్ మ్యాచులు జరగలేదు. 

Chennai Super Kings

గత నాలుగు మ్యాచులు ముగిసిన విధానం చూస్తుంటే ఐపీఎల్ 2023 సీజన్‌లో త్వరలోనే సూపర్ ఓవర్ మ్యాచ్ చూడవచ్చని మాత్రం కచ్ఛితంగా తెలుస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ఐపీఎల్‌లో ‘సూపర్’ ఓవర్ రూపంలో మరో ఎక్స్‌ట్రా బోనస్ చేరితే, ఆ కిక్కే వేరబ్బా.. 

click me!