ఐపీఎల్ 2023 సీజన్ పాండవులు వీరే! సెహ్వాగ్ లిస్టులో కోహ్లీ, శుబ్‌మన్ గిల్‌లకు దక్కని చోటు...

Published : May 27, 2023, 12:31 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌‌కి ఫైనల్ మ్యాచ్‌తో ముగింపు పడనుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌లో కూడా కొన్ని కొత్త ముఖాలు క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యాయి. మొత్తంగా 2023 సీజన్‌లో తనను బాగా ఇంప్రెస్ చేసిన ఐదుగురు బ్యాటర్ల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు టీమిండియా మాజీ వీరేంద్ర సెహ్వాగ్...

PREV
18
ఐపీఎల్ 2023 సీజన్ పాండవులు వీరే! సెహ్వాగ్ లిస్టులో కోహ్లీ, శుబ్‌మన్ గిల్‌లకు దక్కని చోటు...
Kohli and Gill

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సంచలన ప్రదర్శనతో దుమ్మురేపితే సీనియర్ విరాట్ కోహ్లీ, జూనియర్ శుబ్‌మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2023 సీజన్‌లో డజను సెంచరీలు నమోదయ్యాయి..

28

‘నేను ఐపీఎల్ 2023 సీజన్‌లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఐదుగురు పాండవుల గురించి చెప్పబోతున్నా. ఈ సీజన్‌లో బాగా ఆడినా ఐదుగురు బ్యాటర్లే నా పంచ పాండవులు. ఓపెనర్లకు పరుగులు చేసేందుకు చాలా అవకాశాలు ఉంటాయి, అందుకే ఎక్కువ మంది ఓపెనర్లను ఎంపిక చేయలేదు...

38
Image credit: PTI

నా మొదటి పాండవుడు రింకూ సింగ్. ఈ సీజన్‌లో రింకూ సింగ్ ఆట చూసిన వాళ్లకు అతను ఏం చేయగలడో పూర్తి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఐదు సిక్సర్లతో మ్యాచ్‌ని ముగించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఇంతకుముందెన్నడూ చూడలేదు...
 

48

అలాగే శివమ్ దూబే. అతను ఈ సీజన్‌లో ఇప్పటికే 33 సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైయిక్ రేటు 160కి పైగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నా అతను ఎప్పుడూ స్పెషల్‌గా అనిపించలేదు. ఈసారి అతను చాలా క్లియర్ మైండ్‌సెట్‌తో సిక్సర్లు కొడుతున్నాడు...
 

58

మూడో పాండవుడు బ్రిలియెంట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతను ఈ సీజన్‌లో ఆడిన తీరుని వర్ణించడానికి మాటలు రావడం లేదు. అతను ఫ్యూచర్‌పై బోలెడు ఆశలు రేపుతున్నాడు...

68
Image credit: PTI

నాలుగో వాడు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే ఈ సీజన్‌కి ముందు అతను ఫామ్‌లో లేడు. ఆరంభంలో వరుసగా ఫెయిల్ అయ్యాడు కూడా అయితే ఆరంభం గొప్పగా లేకపోయినా సీజన్‌ని గొప్పగా ముగించాడు...
 

78

ఐదో పాండవుడిని సెలక్ట్ చేసేందుకు నేను టాస్ వేసి, సెలక్ట్ చేసుకున్నా. ఎందుకంటే చాలామంది ప్లేయర్లు బాగా ఆడారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసిన్ ఆడిన ఇన్నింగ్స్‌లు చాలా ప్రత్యేకం...

88

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఒంటరి పోరాటం చేసిన హెన్రిచ్ క్లాసిన్, స్పిన్ బౌలింగ్‌ని ఆడిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఫారిన్ ప్లేయర్లు, స్పిన్‌ బౌలింగ్‌ని ఇలా ఆడడం చాలా అరుదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

Read more Photos on
click me!

Recommended Stories