వాడు జోఫ్రా ఆర్చర్! ఆ అయితే... ముంబై స్టార్ బౌలర్‌ని చితక్కొట్టిన విరాట్ కోహ్లీ! ఏదో చేస్తాడనుకుంటే..

Published : Apr 03, 2023, 03:54 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆశలన్నీ జోఫ్రా ఆర్చర్‌పైనే పెట్టుకుంది ముంబై ఇండియన్స్.  జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా క్రికెట్‌కి దూరం కావడంతో ఆర్చర్‌ ఒక్కడే, ముంబై బౌలింగ్ భారాన్ని మోయబోతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ ఆడలేదు జోఫ్రా ఆర్చర్..  

PREV
16
వాడు జోఫ్రా ఆర్చర్! ఆ అయితే... ముంబై స్టార్ బౌలర్‌ని చితక్కొట్టిన విరాట్ కోహ్లీ! ఏదో చేస్తాడనుకుంటే..

2022 మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్ చాలా ఆలస్యంగా వేలానికి వచ్చాడు. అప్పటికీ చాలా టీమ్స్‌ పర్సులో డబ్బులన్నీ అయిపోయాయి. దీంతో రూ.8 కోట్లకు జోఫ్రా ఆర్చర్‌ని దక్కించుకుంది ముంబై ఇండియన్స్. 2022 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ ఆడకపోయినా అతని కోసం రెండు సీజన్లు వెయిట్ చేసింది ముంబై...

26

ఐపీఎల్ 2023 సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.. ఇద్దరు వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగితే, ప్రత్యర్థి బ్యాటర్లు జడుసుకోవడం ఖాయమని అనుకుంది ముంబై ఇండియన్స్. అయితే బుమ్రా గాయంతో ప్లాన్ రివర్స్ అయ్యింది..

36

2022 సీజన్‌లో బుమ్రా ముంబై ఇండియన్స్ బౌలింగ్ భారాన్ని మోయగా, 2023 సీజన్‌లో అతను గాయంతో జట్టుకి దూరమయ్యాడు. 2023 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్, తన బౌన్సర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడనుకుంటే మొదటి మ్యాచ్‌లో అతని నుంచి అలాంటి పర్ఫామెన్స్ రాలేదు...

46
Image credit: PTI

గాయంతో దాదాపు రెండేళ్ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, ఈ ఏడాదిలోనే రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ తర్వాత ఆర్చర్ మునుపటి రిథమ్‌ని అందుకోలేకపోతున్నాడు.  ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఆర్చర్ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించాడు..

56

మొత్తంగా ఆర్చర్ బౌలింగ్‌లో 17 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, 28 పరుగులు చేశాడు. టీ20 మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు కెఎల్ రాహుల్, 2018లో 27 పరుగులు చేయగా, జోస్ బట్లర్ 26 పరుగులు చేశాడు..

66
Jofra Archer

ఆర్చర్ వస్తాడు, ఆశలు తీరుస్తాడు.. అని బోలెడు నమ్మకం పెట్టుకున్న ముంబై ఇండియన్స్‌కి మొదటి మ్యాచ్‌లో చుక్కలు కనిపించాయి. ఓ వైపు ఫాఫ్ డుప్లిసిస్, మరో వైపు విరాట్ కోహ్లీ బౌండరీల మోత మోగించి, మ్యాచ్‌ని 16.2 ఓవర్లలోనే ముగించారు...ముంబై మునుపటి సీజన్ రిజల్ట్‌ని రిపీట్ చేయకుండా ఉండాలంటే జోఫ్రా ఆర్చర్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే.. 

Read more Photos on
click me!

Recommended Stories