లక్నోపై పగ బట్టిన విరాట్ కోహ్లీ... ఎప్పుడూ లేనట్టుగా ఆ మ్యాచ్‌ని ఫాలో అవుతూ...

Published : May 08, 2023, 11:48 AM IST

విరాట్ కోహ్లీకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. క్రికెట్‌లో ప్రతీ గేమ్‌ని పర్సనల్‌గా తీసుకునే విరాట్ కోహ్లీ, బెంగళూరులో ఆర్‌సీబీపై గెలిచిన తర్వాత లక్నో టీమ్ సెలబ్రేషన్స్‌ని తట్టుకోలేకపోయాడు...  

PREV
18
లక్నోపై పగ బట్టిన విరాట్ కోహ్లీ... ఎప్పుడూ లేనట్టుగా ఆ మ్యాచ్‌ని ఫాలో అవుతూ...
Image credit: PTI

లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆ అసహనాన్ని, సెలబ్రేషన్స్‌ని తిరిగి ఇచ్చేశాడు. ఈ సమయంలో లక్నో బ్యాటర్ నవీన్ వుల్ హక్‌తో గొడవ మొదలై, అది అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, మెంటర్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదం జరిగేదాకా వెళ్లింది..
 

28

ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌ ఓడిపోవాలని విరాట్ కోహ్లీ గట్టిగా కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ని విరాట్ కోహ్లీ ఫాలో అవ్వడమే కాకుండా ఈ మ్యాచ్‌పై ఇన్‌స్టా ద్వారా స్పందించాడు..
 

38
(PTI Photo) (PTI05_07_2023_000160B)

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. వరుసగా విఫలమవుతూ వస్తున్న వృద్ధిమాన్ సాహా 43 బంతుల్లో 10 ఫోర్లు,  4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు...

48

20 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న వృద్ధిమాన్ సాహా, గుజరాత్ టైటాన్స్ తరుపున అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు...
 

58
(PTI Photo/Kunal Patil)(PTI03_31_2023_000264B)

‘వాట్ ఏ ప్లేయర్’ అంటూ వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్‌ని పొగిడిన విరాట్ కోహ్లీ, టీవీలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌ని వీక్షిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..

68

228 పరుగుల లక్ష్యఛేదనని ధాటిగా ఆరంభించింది లక్నో సూపర్ జెయింట్స్. తొలి వికెట్‌కి కైల్ మేయర్స్, క్వింటన్ డి కాక్ కలిసి 88 పరుగులు జోడించారు. 32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన కైల్ మేయర్స్, మోహిత్ శర్మ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
 

78

కైల్ మేయర్స్  కొట్టిన షాట్‌ని రషీద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. బంతి దిశగా అంచనా వేయలేకపోయిన రషీద్ ఖాన్, ఆఖరి సెకన్లలో యాంగిల్ మార్చి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై కూడా విరాట్ కోహ్లీ స్పందించాడు..
 

88
Rashid Khan

‘నేను చూసిన బెస్ట్ క్యాచుల్లో ఇది కూడా ఒకటి. బ్రిలియెంట్ రషీద్ ఖాన్’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టాడు విరాట్ కోహ్లీ. చూస్తుంటే ఆర్‌సీబీ, లక్నో మధ్య మ్యాచ్‌లో గొడవల తర్వాత ఆ విషయాన్ని పర్సనల్‌గా తీసుకున్న విరాట్ కోహ్లీ, ఆ టీమ్ ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది..

Read more Photos on
click me!

Recommended Stories