తొక్క తీస్తా! రాజస్థాన్ రాయల్స్‌పై ‘RRR’ టీమ్ సీరియస్.. మా వాడు మీ కంటే తోపు అన్నందుకు ఆడుకుంటూ...

Published : May 08, 2023, 11:08 AM IST

ఐపీఎల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉన్నా, సోషల్ మీడియా ఫాలోయింగ్ మెండుగా ఉన్న టీమ్ రాజస్థాన్ రాయల్స్. ఛలోక్తులు, ఛమత్కారం, కాస్త వెటకారం జోడించి మీమ్స్ పోస్టు చేసే రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా అకౌంట్లకు మంచి ఫాలోయింగ్ ఉంది..

PREV
16
తొక్క తీస్తా! రాజస్థాన్ రాయల్స్‌పై ‘RRR’ టీమ్ సీరియస్.. మా వాడు మీ కంటే తోపు అన్నందుకు ఆడుకుంటూ...
Rajasthan Royals

అయితే కొన్ని సార్లు ఆ వెటకారం హద్దులు మీరి, రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణమవుతూ ఉంటుంది...

26

తాజాగా కెప్టెన్ సంజూ శాంసన్‌ని పొగుడుదామని రాజస్థాన్ రాయల్స్ వేసిన ట్వీట్‌పై RRR మూవీ టీమ్ రియాక్ట్ అయిన విధానం హాట్ టాపిక్ అయ్యింది.. ‘SSS (Skipper Sanju Samson) > RRR’ అంటూ ట్వీట్ చేసింది రాజస్థాన్ రాయల్స్..

36
sanju samson

మా వాడి బ్యాటింగ్, త్రిబుల్ ఆర్ సినిమా కంటే తోపుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ట్వీట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్. దీనిపై తెలుగు అభిమానులు రియాక్ట్ అవ్వడమే కాకుండా ఏకంగా RRR మూవీ టీమ్ కూడా కౌంటర్ ఇచ్చింది..

46

రాజస్థాన్ రాయల్స్ ట్వీట్‌కి ‘వెంకీ’ సినిమాలో బ్రహ్మానందం, రవితేజతో చెప్పే ‘అవన్నీ నమ్మావంటే నువ్వుకుంటూ అడుక్కుతినాల్సి ఉంటుంది రా...’  అనే డైలాగ్‌ క్లిప్‌ని కామెంట్ చేసింది RRR movie అధికారిక ట్విట్టర్ ఖాతా. RRR మూవీని నిర్మించిన డీవీవీ  ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా దీనిపై తన స్టైల్‌లో స్పందించింది..

56

‘తొక్క తీస్తా... నీ య* పెట్టరా సంతకం... పెట్టు’ అంటూ రవితేజ ‘ఇడియట్’ సినిమాలో పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాసరావుని కొడుతూ 30 ఇయర్స్ పృథ్వీ చెప్పే డైలాగ్‌ని రిప్లైగా పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్...

66

ఈ ట్వీట్‌కి నిమిషాల వ్యవధిలోనే 3.1 మిలయన్ల రీచ్‌తో పాటు 500+ పైగా కామెంట్లు రావడంతో రాజస్థాన్ రాయల్స్ తప్పు తెలుసుకుని, క్షమాపణలు చెప్పింది. ‘ఈ మూవీ ప్రపంచమంతటా సక్సెస్ సాధించింద. కాబట్టి మేం క్షమాపణలు చెబుతున్నాం. SSS & RRR రెండూ గ్రేట్..’ అంటూ  మరో ట్వీట్ చేసింది రాయల్స్ టీమ్..

click me!

Recommended Stories