ధోనీ, ఆర్‌సీబీ కెప్టెన్ అయ్యుంటే, మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచేవాడు! వసీం అక్రమ్ కామెంట్స్...

First Published May 8, 2023, 10:41 AM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్‌ని 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ధోనీ, 11 సార్లు ప్లేఆఫ్స్‌కి, 7 సార్లు ఫైనల్స్‌కి చేర్చాడు. ఇప్పటిదాకా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవని జట్టు సీఎస్‌కే ఒకట్టే...

మొదటి 14 సీజన్లలో ఆఖరి స్థానంలో నిలవని ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి, ఆఖరి పొజిషన్‌లో నిలిచింది. సీఎస్‌కే కూడా 14 మ్యాచుల్లో నాలుగే గెలిచినా మెరుగైన రన్ రేట్ కారణంగా 9వ స్థానంలో నిలిచింది...

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ప్లేఆఫ్స్ చేరిన టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2020 నుంచి వరుసగా నాలుగు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది..
 

Latest Videos


‘ఆర్‌సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి అది ఇప్పటికి నాలుగైదు టైటిల్స్ గెలిచేసి ఉండాలి. నేటి తరంలో బెస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఆర్‌సీబీలో ఉన్నాడు.. 

Image credit: PTI

ఐపీఎల్‌ ఆరంభం నుంచి కోహ్లీ, ఆర్‌సీబీలోనే ఉన్నాడు. అయితే టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. ఆర్‌సీబీకి ధోనీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, ఇప్పటికి ఈజీగా కనీసం మూడు టైటిల్స్ గెలిచేవాడు.. 
 

ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎక్కడ ఫెయిల్ అయ్యాడనేది నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అతను చాలా హర్డ్ వర్క్ చేస్తాడు. నాకు తెలిసి అతను ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్సీ కూడా చేశాడు..

అక్కడా ఇక్కడా కెప్టెన్సీ చేయడం వల్ల ఐపీఎల్‌లో సక్సెస్ రాకపోయి ఉండొచ్చు. కేవలం ఆర్‌సీబీకి మాత్రమే కెప్టెన్‌గా ఉండి ఉంటే, కచ్ఛితంగా సక్సెస్ అయ్యేవాడు. అతను ప్రతీ మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తాడు..
 

Image credit: PTI

ధోనీకి కెప్టెన్సీ భారం కాదు, అది అతనికి అలవాటుగా మారిపోయింది. విరాట్ కోహ్లీ కూడా ధోనీ దగ్గరే కెప్టెన్‌గా ఎదిగాడు. కోహ్లీ లోపల ఏదీ దాచుకోలేడు. ధోనీకి కూడా కోపం వస్తుంది అయితే దాన్ని లోపలే దాచేస్తాడు, బయటికి చూపించడు..

Image credit: PTI

మహేంద్ర సింగ్ ధోనీ కళ్లను చూస్తే అతను ఎంత కోపంగా ఉన్నాడో అర్థం అవుతుంది. అయితే ఆ కోపాన్ని తన ముఖంలో చూపించకుండా జాగ్రత్త పడతాడు ధోనీ. కోహ్లీకి ఆ టెక్నిక్ తెలీదు..  ధోనీ, ప్లేయర్లపై పూర్తి భరోసా ఉంచుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్..  

click me!