కోహ్లీ, రోహిత్, టెండూల్కర్, ధోనీ... రాత్రికి రాత్రే బ్లూ టిక్ కోల్పోయిన స్టార్ క్రికెటర్లు! ఫ్యాన్స్ మాత్రం...

First Published Apr 21, 2023, 12:11 PM IST

వేల కోట్లకు అధిపతి అయ్కాక కాస్త వెర్రి కూడా ఎక్కువైంది ఎలన్ మస్క్‌కి! కావాలని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన మస్క్, దాంట్లో తన పైత్యం మొత్తం చూపించేస్తున్నాడు. ట్విట్టర్ పక్షిని తీసి కొన్నాళ్ల పాటు లోగోగా కుక్క మూతిని పెట్టి యూజర్లను వెక్కిరించిన మస్క్, ఇప్పుడు సెలబ్రిటీల ఖాతాలకు షాక్ ఇచ్చాడు...

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఫేస్‌బుక్‌కి క్రేజ్ తగ్గాక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు క్రికెటర్లు. అయితే రాత్రికి రాత్రే వీరి ట్విట్టర్‌ అకౌంట్‌లకు ఉన్న వెరిఫికేషన్ టిక్ మాయమైంది...

ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ట్విట్టర్ వెరిఫికేషన్ టిక్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ మాదిరిగానే నెలకు ఇంత కట్టిన వారందరికీ వెరిఫికేషన్ టిక్ ఇవ్వబడును.. అని మస్క్ స్వయంగా ప్రకటించాడు. తాజాగా సెలబ్రిటీల వెరిఫికేషన్ టిక్ తీసేసి ఊహించని షాక్ ఇచ్చాడు మస్క్...

Latest Videos


ఒకప్పుడు ట్విట్టర్‌ని విపరీతంగా వాడిన మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుతం సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. మొబైల్ ఫోన్‌ని కేవలం గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే వాడుతున్న ధోనీ, అప్పుడప్పుడూ ఫేస్‌బుక్‌లో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంటాడు. ట్విట్టర్లు ట్వీట్లు వేసి చాలా కాలమే అయ్యింది...

ఎన్నో ఏళ్లుగా అకౌంట్ యాక్టీవ్‌గా లేకపోవడంతో మహేంద్ర సింగ్ ధోనీ ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ టిక్‌ నుంచి ఏడాది క్రితం తొలగించింది ట్విట్టర్. అయితే అభిమానులు, ట్విట్టర్‌ని బ్యాన్ చేస్తామంటూ గోల చేసి, ట్రెండ్ చేయడంతో మళ్లీ ధోనీ అకౌంట్‌కి బ్లూ టిక్ ఇచ్చేసింది.. 

Sachin Tendulkar

వెరిఫికేషన్ టిక్ కోల్పోయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వీరితో పాటు ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వెరిఫికేషన్ టిక్ కూడా లేపేసింది ట్విట్టర్. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటో ధోనీ, సచిన్, కోహ్లీ, రోహిత్ అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ పోయినా... వారి ఫ్యాన్స్ అకౌంట్స్‌కి వెరిఫికేషన్ టిక్ ఉంది. బ్లూ టిక్ అమ్మకంలోకి రాగానే ఈ ఫ్యాన్స్ అకౌంట్ అన్నీ నెలవారీ రుసుం చెల్లించి, బ్లూ టిక్‌ని తగిలించుకున్నాయి.. 

click me!