టీమిండియాకి గుడ్‌న్యూస్! శ్రేయాస్ అయ్యర్‌ సర్జరీ సక్సెస్‌‌ఫుల్... త్వరలో లండన్ నుంచి స్వదేశానికి...

Published : Apr 21, 2023, 11:48 AM IST

ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ రూపంలో రెండు ఐసీసీ టోర్నీల్లో ఆడబోతోంది టీమిండియా. అయితే మెగా టోర్నీలకు ముందు జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టుకి దూరమయ్యాడు...  

PREV
18
టీమిండియాకి గుడ్‌న్యూస్! శ్రేయాస్ అయ్యర్‌ సర్జరీ సక్సెస్‌‌ఫుల్... త్వరలో లండన్ నుంచి స్వదేశానికి...
Shreyas Iyer

వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొనలేదు. అలాగే ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ అయ్యర్ ఆడడం లేదు...

28
Image credit: PTI

తాజాగా శ్రేయాస్ అయ్యర్‌కి లండన్‌లో జరిగిన వెన్నెముక సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అతను త్వరలో ఇండియాకి కూడా రాబోతున్నాడు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకుని, తిరిగి ఆడేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు...

38
Shreyas Iyer

దీంతో అక్టోబర్‌లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సమయానికి శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే గాయం కారణంగా టీమ్‌కి దూరమైన అయ్యర్‌ని నేరుగా వన్డే వరల్డ్ కప్‌లో ఆడించేందుకు బీసీసీఐ ఇష్టపడుతుందా? అనేది అనుమానంగా మారింది..

48

ఇలా శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్‌కి దూరమవ్వడం ఇది రెండోసారి... 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత 2021 సీజన్ ఫస్టాఫ్‌లో గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు. కరోనా కేసులతో సీజన్ మధ్యలో వాయిదా పడడంతో రెండో ఫేజ్‌లో ఆడినా కెప్టెన్సీ కోల్పోయాడు..

58

ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ని రూ.12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. మొదటి సీజన్‌లో కేకేఆర్‌ని ప్లేఆఫ్స్ కూడా చేర్చలేకపోయాడు అయ్యర్...

68
Image credit: PTI

శ్రేయాస్ అయ్యర్ గైర్హజరీలో నితీశ్ రాణా, ప్రస్తుతం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆరంభంలో మంచి విజయాలు అందుకున్న కేకేఆర్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడిపోయింది..

78
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000412B)

నితీశ్ రాణా ఆన్ ఫీల్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నా, టీమ్ కాంబినేషన్ దగ్గర్నుంచి అన్ని విషయాలు, శ్రేయాస్ అయ్యర్ చెప్పినట్టే జరుగుతున్నాయని, అతను బయటి నుంచి టీమ్‌ని నడిపిస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. 

88

వెన్నుగాయంతో టీమ్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, సర్జరీ ముందు రోహిత్ శర్మతో కలిసి శార్దూల్ ఠాకూర్ పెళ్లికి హాజరయ్యాడు. అలాగే యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఓ ఇప్తార్ పార్టీలో కనిపించి, ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.. 

click me!

Recommended Stories