స్క్రిప్టులో డ్రామా మరీ ఎక్కువైంది శిష్యా! ఇవేం మ్యాచులు గురువా... ఐపీఎల్ 2023 సీజన్‌ మ్యాచులపై...

First Published Apr 21, 2023, 11:25 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ప్రతీ మ్యాచ్ దేనికదే ప్రత్యేకం. మొదటి వారంలో కాస్త వన్ సైడ్ మ్యాచులు జరిగినా రెండో వారం నుంచి సీన్ మారింది. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఫలితం తేలకుండా ఉత్కంఠరేపుతున్నాయి మ్యాచులు...

Image credit: PTI

గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచులు కూడా లాస్ట్ బాల్ థ్రిల్లర్స్‌గా మిగిలాయి...

అయితే మూడో వారం వచ్చేసరికి మ్యాచులు మరీ స్క్రిప్టెడ్‌లా తయారయ్యాయి. లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా దాదాపు 80 పరుగులు చేసిన లక్నో, ఆ తర్వాత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేయగలిగింది...

Latest Videos


Image credit: PTI

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఇరగదీశారని వదిలేసినా, ఆ తర్వాత వాళ్ల బ్యాటింగ్ చూసిన జనాలకు నీరసం వచ్చేసింది. వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసి ఈజీగా గెలిచేలా కనిపించిన రాజస్థాన్ రాయల్స్, 20 ఓవర్లు బ్యాటింగ్ చేసినా 144 పరుగులే చేసి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది..
 

PTI PhotoVijay Verma) (PTI04_20_2023_000479B)

అలాంటి ఆరంభం దక్కిన తర్వాత ఇలాంటి రిజల్ట్ ఎవ్వరూ ఊహించి ఉండరు. కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా హై డ్రామా నడిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్, 20 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

PTI PhotoVijay Verma) (PTI04_20_2023_000405B)

ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి ఓవర్ వరకూ ఆగాల్సి వచ్చింది. ఎప్పటిలాగే డేవిడ్ వార్నర్ తప్ప మిగిలిన బ్యాటర్లు అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఢిల్లీ బ్యాటింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేకపోయినా, వాళ్లు అవుటైన విధానం మరీ దారుణంగా ఉంది...

క్యాచ్ తీసుకో అని చెప్పి మరీ కొట్టినట్టు అవుట్ అయ్యారు. దీంతో ఈ మ్యాచులన్నీ స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తున్నాయనే వాదన ఎక్కువైంది. ఐపీఎల్ మీద కొన్ని వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. వన్ సైడ్ మ్యాచుల వల్ల బెట్టింగ్ నిర్వాహకులకు, బెట్టింగ్ రాయుళ్లకు పెద్దగా లాభం ఉండదు...

PTI PhotoVijay Verma) (PTI04_20_2023_000412B)

ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేగితేనే చూసే జనాలకు, పందెం కాసే బెట్టింగ్ రాయుళ్లకు మజా... అందుకే ఈజీగా అవ్వగొట్టాల్సిన మ్యాచులను కూడా మెలో డ్రామాలుగా మలుస్తున్నారని అంటున్నారు చాలామంది నెటిజన్లు... 

PTI PhotoRavi Choudhary)(PTI04_11_2023_000352B)

అయితే గుడ్డు పెట్టే కోడికే ఆ బాధ తెలిసినట్టు, గెలవడానికి 100 శాతం కష్టపడుతున్న ప్లేయర్లకే ఐపీఎల్‌లో మ్యాచులు గెలవడం, గెలిపించడం ఎంత కష్టమో తెలుస్తుందని అంటున్నారు మరికొందరు... 

click me!