ఐపీఎల్ -16 లో అదరగొడుతున్న రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోల్కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్ త్వరలోనే భారత జట్టులోకి రావడం పక్కా అని దానిని ఎవరూ ఆపలేరు అని జోస్య చెబుతున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.
27
ఈ ఇద్దరూ ఏదో ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్నారనుకుంటే తప్పేనని, దేశవాళీలో కూడా నిలకడగా ఆడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని చోప్రా చెప్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఈ ఇద్దరికీ సాలిడ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
37
Image credit: PTI
హిందూస్తాన్ టైమ్స్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో చోప్రా మాట్లాడుతూ.. ‘రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాబోయే 90 రోజుల్లో టీమిండియాలో ఉంటాడు. ఇది పక్కా. మరో ఆటగాడు రింకూ సింగ్. అతడు ఆషామాషీ ఆటగాడు కాదు. గుజరాత్ పై ఆ ఐదు సిక్సర్లు మామూలుగా వచ్చినవి కావు.
47
రింకూ వస్తున్న పొజిషన్ లో బ్యాటింగ్ కు వచ్చి 400 కు పైగా పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఆ ప్లేస్ లో మరో ఆప్షన్ కూడా లేకుండా ఆడుతున్నాడు. గుర్తు పెట్టుకోండి. ఇవేం కేవలం టీ20లలో మాత్రమే వచ్చిన ప్రదర్శనలు. రింకూకు ఫస్ట్ క్లాస్ లో 60 సగటు ఉంది.
57
యశస్వి కూడా దేశవాళీలో ఆడిన ప్రతీ ఫార్మాట్, టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ అత్యద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఒక్క ఐపీఎల్ లోనే గాక ఇతర ఫార్మాట్లలో కూడా వాళ్లిద్దరూ బాగా ఆడుతున్నారు..’అని అన్నాడు.
67
ఈ సీజన్ లో జైస్వాల్.. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడి నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సాయంతో 575 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కూడా అతడి పేరిటే నమోదైంది. కేకేఆర్ తో మ్యాచ్ లో జైస్వాల్.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
77
ఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. 13 మ్యచ్ లలో 50.88 సగటుతో అతడు 407 పరుగులు చేశాడు. రింకూ కూడా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. గుజరాత్, పంజాబ్, చెన్నైతో మ్యాచ్ లలో కేకేఆర్ గెలుపులో రింకూ కీలక పాత్ర పోషించాడు.