లక్నో చేతుల్లో ముంబై ఓటమి... ఎవరికి లాభం? ఎవరికి నష్టం! ఫ్లేఆఫ్స్ రేసు మరింత...

First Published May 17, 2023, 3:30 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈ వారం మ్యాచులు ఊహకు అందని ఫలితాలను అందిస్తున్నాయి. ఈజీగా గెలుస్తాయని అనుకున్న టీమ్స్ అట్టర్ ఫ్లాప్ అవుతుంటే, ఇక ఫ్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్టే అనుకున్న టీమ్స్.. అదిరిపోయే విజయాలను అందుకుంటున్నాయి..

Image credit: PTI

ఆర్‌సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఈజీగా గెలుస్తుందని అనుకుంటే, ఏకంగా 59 పరుగులకి ఆలౌట్ అయి 112 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది...

Image credit: PTI

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయి, గుజరాత్ టైటాన్స్‌‌కి టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్ బెర్త్ కన్పార్మ్ చేసింది. టాప్ 3లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓడింది..

Latest Videos


Image credit: PTI

ముంబై ఇండియన్స్ పరాజయం ఎవరికి లాభం? ఎవరికి నష్టం... ముంబై ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్‌, ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే.. 17 పాయింట్లతో నేరుగా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడుతుంది. 

కీలక మ్యాచ్‌లో గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడినా లక్నోకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. 
 

Image credit: PTI

12 పాయింట్లతో టాప్ 5లో ఉన్న ఆర్‌సీబీ, ఆఖరి రెండు లీగ్ మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరడం ఈజీ అయిపోతుంది. రాయల్స్‌పై 112 పరుగుల తేడాతో గెలవడంతో ముంబై కంటే మంచి నెట్‌రన్ సాధించిన ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌లతో మ్యాచులు ఆడనుంది. ఈ రెండు గెలిస్తే చాలు, బెంగళూరుకి ప్లేఆఫ్స్‌ వెళ్లే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. 

12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్స్, పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచినా ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, కేకేఆర్ మిగిలిన మ్యాచుల్లో ఓడితేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది...

Image credit: PTI

కేకేఆర్ కూడా 12 పాయింట్లతో ఉంది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది కోల్‌కత్తా. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది కోల్‌కత్తా. అయితే ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబై, ఆర్‌సీబీ ఆఖరి మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది..

PTI PhotoRavi Choudhary)(PTI05_13_2023_000485B)

పంజాబ్ కింగ్స్ 12 మ్యాచుల్లో 6 గెలిచి, 12 పాయింట్లతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులు ఆడనుంది పంజాబ్. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లతో పంజాబ్ కింగ్స్‌కి ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. అయితే ఆర్‌సీబీ ఆఖరి రెండింట్లో ఒకటి ఓడిపోయి, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోతే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం పక్కా.. 

click me!