ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు... ఒకే టీమ్ తరుపున 250 మ్యాచులు ఆడిన మొదటి ప్లేయర్‌గా...

First Published May 14, 2023, 4:52 PM IST

ఫామ్‌లో ఉన్నా, లేకపోయినా రికార్డులు క్రియేట్ చేయడంలో మాత్రం విరాట్ కోహ్లీ ఎక్కడా తగ్గడం లేదు. ఐపీఎల్‌లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది...

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్, విరాట్ కోహ్లీకి ఆర్‌సీబీ తరుపున 250వ మ్యాచ్. ఐపీఎల్‌లోనే కాదు, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే టీమ్ తరుపున 250 మ్యాచులు ఆడిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 240 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధోనీ, సీఎస్‌కే తరుపున ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్‌ కూడా ఆడి రెండు సార్లు టైటిల్స్ కూడా గెలిచాడు...

Latest Videos


Virat kohli

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున 235 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, ఛాంపియన్స్ లీగ్ టీ20లో మూడు సీజన్లలో 15 మ్యాచులు ఆడాడు... 

2016-17 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌పై బ్యాన్ పడడంతో మహేంద్ర సింగ్ ధోనీ, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఆడాడు. దీంతో ఐపీఎల్‌లో 16 సీజన్లుగా ఒకే టీమ్ తరుపున ఆడుతున్న ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ..

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు గురించి తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది..

ఇంతకుముందు మ్యాచుల్లో 110-120 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, నేటి మ్యాచ్‌లో 94.74 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు...

click me!