IPL: ఈ రికార్డులు 2023లో అయినా బద్దలవుతాయా..?

Published : Mar 31, 2023, 03:24 PM IST

IPL 2023: మరికొద్దిసేపట్లో ఐపీఎల్- 16 సీజన్ మొదలవబోతున్నది.   అయితే ఈ సీజన్ కు ముందు  ఇప్పటివరకు   ఎవరూ బ్రేక్ చేయలేని  రికార్డులలో కొన్నింటిని చూద్దాం.. 

PREV
19
IPL: ఈ రికార్డులు  2023లో అయినా బద్దలవుతాయా..?

నేటి నుంచి అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్  - 2023 ఎడిషన్  లో తొలి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్  - చెన్నై సూపర్ కింగ్స్ నడుమ జరుగనుంది. కాగా  ఈ సీజన్ కు ముందే ఐపీఎల్ లో పలు ఫ్రాంచైజీలు, పలువురు ఆటగాళ్లు  నమోదుచేసిన  కొన్ని రికార్డులు  ఇప్పటికీ బద్దలవలేదు. అవేంటో ఒకసారి చూద్దాం. 

29

ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన  బ్యాటర్ విరాట్ కోహ్లీ.  2016 ఐపీఎల్ లో  కోహ్లీ తన విశ్వరూపాన్ని  చూపాడు. ఈ సీజన్ లో ఏకంగా నాలుగు సెంచరీలతో చెలరేగిన కోహ్లీ.. మొత్తంగా ద 973 పరుగులు చేశాడు.  ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. 

39

గతేడాది రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్..  863 పరుగులతో కోహ్లీకి దగ్గరగా వచ్చినా  రికార్డును బ్రేక్ చేయలేకపోయాడు. అంతేగాక  వరుసగా 13 సీజన్లుగా  ఐపీఎల్ లో 300 ప్లస్ స్కోరు చేసిన బ్యాటర్ కూడా కోహ్లీనే.. 

49

ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ క్రిస్ గేల్. 2013లో పూణె వారియర్స్ టీమ్ పై  గేల్..  175 పరుగులు చేసి నాటౌట్ (ఆర్సీబీ తరఫున ఆడాడు) గా నిలిచాడు. ఐపీఎల్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా టీ20లలో  యూనివర్సల్ బాస్ రికార్డు చెక్కు చెదరలేదు.

59

వరుసగా పది మ్యాచ్ లలో గెలిచిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్. 2014, 2015 సీజన్లలో  కేకేఆర్.. వరుసగా పది మ్యాచ్ లలో గెలిచి రికార్డు సృష్టించింది. ఐపీఎల్ లో మరే టీమ్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు. 

69

ఒక ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఆండ్రూ రసెల్. ఈ కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్.. 2022 ఐపీఎల్ సీజన్ లో   గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో    ఐదు పరుగులే ఇచ్చి  నాలుగు వికెట్లు తీశాడు. 

79

ఒక మ్యాచ్ లో అత్యుత్తమ  బౌలింగ్ గణాంకాలు.. విండీస్ బౌలర్ అల్జారీ  జోసెఫ్ పేరిట ఉన్నాయి.  జోసెఫ్.. 2019లో సన్ రైజర్స్ పై ఆడుతూ (అప్పుడు ముంబై తరఫున ఆడాడు)  12 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

89

ఐపీఎల్ లో అత్యధిక  హ్యాట్రిక్ లు తీసుకున్న బౌలర్ అమిత్ మిశ్రా.  ఈ లీగ్ లో మిశ్రా  ఏకంగా   మూడు సార్లు  హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.  2008,  2011, 2013 ఎడిషన్స్ లో  మిశ్రా ఈ ఘనతను అందుకున్నాడు.  

99

ఐపీఎల్  లో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టు  చెన్నై సూపర్ కింగ్స్.  మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై.. ఏకంగా 9 సార్లు ఫైనల్స్ ఆడింది. ఇందులో  నాలుగు సార్లు టైటిల్ కూడా నెగ్గింది.  
 

click me!

Recommended Stories