జియో సంచలన నిర్ణయం... 11 భాషల్లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు...

Published : Jan 10, 2023, 04:54 PM IST

కార్పొరేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మనసులో ఏముందో పసికట్టడం మార్కెట్ విశ్లేషకులకు కూడా కష్టమే. ఎక్కడ డిమాండ్ ఉందో కనిపెట్టి, ఆ రంగంలోకి సైలెంట్‌గా అడుగుపెట్టి... ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగా మిగిలిన పోటీదారులకు మట్టుపెట్టడంలో రిలయెన్స్ స్ట్రాటెజీలే వేరు... 

PREV
17
జియో సంచలన నిర్ణయం... 11 భాషల్లో ఉచితంగా ఐపీఎల్ 2023 సీజన్ ప్రసారాలు...

మొబైల్ పరిశ్రమలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది జియో. మిగిలిన మొబైల్ ఆపరేటర్లు 100 ఎం.బీ డేటాకి రూ.50-100 ఛార్జ్ చేస్తున్న సమయంలో టెలి కమ్యూనికేషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జియో... అన్‌లిమిటెడ్ మొబైల్ డేటాని ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించి... సంచలనం సృష్టించింది...

27
BSNL Jio

జియో రాకతో అప్పటి వరకూ చలామణీలో ఉన్న టాటా ఇండికామ్, ఎయిర్‌సెల్, టాటా డొకోమో వంటి ఉత్పత్తులు మూత పడిపోగా వోడాఫోన్- ఐడియా చేతులు కలిపి వీఐగా మారింది... జియో దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది..

37

మొదటి సంవత్సరం ఉచితంగా అన్‌ లిమిటెడ్ కాల్స్, డైలీ 2 జీబీ డేటా అందించిన జియో... ప్రస్తుతం కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేస్తూ, ఆధిపత్యం చెలాయిస్తోంది... ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ ఇదే రకమైన స్ట్రాటెజీతో అడుగుపెడుతోంది రిలయెన్స్...

47

ఐపీఎల్ 2023-27 సీజన్లకు సంబంధించిన డిజిటల్ మీడియా రైట్స్‌ని రూ.23,773 కోట్లకు దక్కించుకుంది రిలయెన్స్‌కి చెందిన వయాకమ్ 18. ఐపీఎల్ 2023 సీజన్ కోసం కొత్త ఓటీటీ యాప్‌ని తీసుకురాబోతున్నారని ప్రచారం జరిగింది...

57
Image credit: PTI

అయితే ఐపీఎల్ 2023 సీజన్ దగ్గర పడుతున్న కొత్త యాప్‌ని తీసుకురాని జియో, ఈ ఏడాది లీగ్‌ని ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకుందట. 11 భాషల్లో జియో సినిమా, జియోటీవీ యాప్స్‌లో జియో సిమ్ వాడకందారులకు ఐపీఎల్ 2023 ప్రత్యేక్ష ప్రసారాలు ఉచితంగా అందిస్తోంది...

67
Image credit: PTI

స్టార్ నెట్‌వర్క్‌కి చెందిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కి ఐపీఎల్ ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఐపీఎల్ మ్యాచులు చూసేందుకు నెలకు రూ.99 దాకా సబ్‌స్క్రిప్షన్ ఫీజుగా వసూలు చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. జియో మాత్రం ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

77
Image credit: PTI

ఫ్రీగా ఇచ్చి, బాగా అలవాటు పడ్డాక డబ్బులు వసూలు చేయాలనే స్ట్రాటెజీనే ఐపీఎల్‌కి కూడా వాడబోతుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ ఏడాది ఫ్రీ అని చెప్పి కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకుని, వచ్చే సీజన్ నుంచి భారీగా వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. 

click me!

Recommended Stories