5 వికెట్లు తీసినా! డబుల్ సెంచరీ బాదినా తీసి పక్కనబెట్టేస్తారు... టీమిండియాలో చోటు కావాలంటే ఇంకేం చేయాలి!

Published : Jan 10, 2023, 02:56 PM IST

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా పూర్తిగా మారిపోయింది. టీమ్ సెలక్షన్ విషయంలో, తుది జట్టును సెలక్ట్ చేసే విషయంలో బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ద్రావిడ్ కంటే రవిశాస్త్రి చాలా బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి...

PREV
18
5 వికెట్లు తీసినా! డబుల్ సెంచరీ బాదినా తీసి పక్కనబెట్టేస్తారు... టీమిండియాలో చోటు కావాలంటే ఇంకేం చేయాలి!
Kuldeep Yadav

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, రెండో ఇన్నింగ్స్‌లో మరో 3 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. బ్యాటుతోనూ 40 పరుగులు చేసి అదరగొట్టాడు. అయినా ఆ తర్వాతి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కలేదు...

28
Kuldeep Yadav

12 ఏళ్ల తర్వాత జయ్‌దేవ్ ఉనద్కట్‌ని టెస్టు టీమ్‌లోకి తీసుకురావడానికి 8 వికెట్లు తీసి, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన కుల్దీప్ యాదవ్‌ని పక్కనబెట్టేసింది టీమిండియా... ఇది ఇక్కడితో ఆగలేదు...

38
Image credit: PTI

బంగ్లాదేశ్‌తో తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత మూడో వన్డేలో ఇషాన్ కిషన్‌కి అవకాశం దక్కింది. రోహిత్ శర్మ గాయపడడంతో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో వరల్డ్ రికార్డులే బ్రేక్ చేసేశాడు...

48
ishan

2022, డిసెంబర్ 10న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతి కొద్ది మంది భారతీయుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతి పిన్న వయసులో డబుల్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా, అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా వరల్డ్ రికార్డులు క్రియేట్ చేశాడు...

58

ఆ ఫీట్ తర్వాత కూడా ఇషాన్ కిషన్‌ని తర్వాతి వన్డేలో చోటు దక్కలేదు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ధోనీ, విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్ల హయాంలో ఎవరైనా ప్లేయర్ బాగా ఆడితే అతనికి ఆ తర్వాత కనీసం రెండు మూడు మ్యాచుల్లో అవకాశం దక్కేది. కరణ్ నాయర్‌ త్రిబుల్ సెంచరీ చేశాడు మూడు టెస్టులు ఆడాడు...

68
Image credit: Getty

ఇషాన్ కిషన్ అయితే డబుల్ సెంచరీ బాదిన తర్వాత మ్యాచ్‌లోనే తుదిజట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ టోర్నీల్లో రికార్డుల మోత మోగిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, టీమిండియాకి ఎందుకు సెలక్ట్ కావడం లేదో అర్థం కాదు! పృథ్వీ షాని ఎందుకు పట్టించుకోవడం మానేశారో తెలీదు...

78

వరుసగా ఫెయిల్ అవుతున్నా కెఎల్ రాహుల్‌కి ఎందుకు ఇన్ని ఛాన్సులు ఇస్తున్నారో తెలియడం లేదు. అన్నింటికీ మించి టీమిండియాలో ఉండాలంటే ఇంకా ఏం చేయాలో తెలియడం లేదని కామెంట్లు చేస్తున్నారు భారత క్రికెట్ అభిమానులు.

88
Image credit: Getty

రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా అయితే టీమిండియా వరల్డ్ కప్స్ గెలుస్తుందని బోలెడు ఆశలు పెట్టుకుంటే ఇంకేదో చేశారంటూ మరేదో చేస్తున్నారంటూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు..  ప్లేయర్లకు భరోసా ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన వాళ్లే, ఇలా వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories