ఇదేం కొత్త కాదుగా! అతని కెప్టెన్సీ అంటే ఆ మాత్రం ఉంటది... రాహుల్‌ని మరోసారి టార్గెట్ చేసిన వెంకటేశ్ ప్రసాద్...

Published : Apr 23, 2023, 04:03 PM IST

రాహుల్‌తో తనకి ఏ వైరం ఉందో తెలీదు కానీ అవకాశం దొరికినప్పుడు ఈ శెట్టి అల్లుడిని ఓ ఆటాడుకుంటున్నాడు టీమిండియా మాజీ క్రికిటర్ వెంకటేశ్ ప్రసాద్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టెస్టు సిరీస్ సమయంలో కెఎల్ రాహుల్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్. శుబ్‌మన్ గిల్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి రాహుల్‌ని ఆడిస్తున్న సెలక్టర్లను, టీమ్ మేనేజ్‌మెంట్‌ని ఎండబెట్టాడు...

PREV
18
ఇదేం కొత్త కాదుగా! అతని కెప్టెన్సీ అంటే ఆ మాత్రం ఉంటది... రాహుల్‌ని మరోసారి టార్గెట్ చేసిన వెంకటేశ్ ప్రసాద్...
KL Rahul

రాహుల్ సమర్థుడు, సత్తా ఉన్నోడని అతన్ని కవర్ చేసేందుకు ఆకాశ్ చోప్రా ప్రయత్నించడంతో వెంకటేశ్ ప్రసాద్ మరింత రెచ్చిపోయి, అతని లెక్కలు, బొక్కలు అన్నీ బయటపెట్టాడు. దీంతో ఇంత రచ్చ జరిగినా రాహుల్‌ని ఇంకా ఆడిస్తే బాగోదని అతన్ని సైడ్ చేసేసింది టీమిండియా...

28
KL Rahul

తాజాగా మరోసారి కెఎల్ రాహుల్‌ని టార్గెట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్. కారణం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్. 136 పరుగుల ఈజీ టార్గెట్. మంచి ఆరంభం దక్కింది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి...

38
KL Rahul

39 బంతుల్లో 34 పరుగులు చేస్తే చాలు. అంటే బంతికో పరుగు తీసి, బౌండరీలు కొట్టకపోయినా ఆఖరి ఓవర్‌లో మరో 5 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ అవ్వగొట్టొచ్చు. అయితే అలాంటి మ్యాచ్‌లో చిత్తుగా 7 పరుగుల తేడాతో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్...

48
KL Rahul

15వ ఓవర్‌లో 1 పరుగు మాత్రమే రాగా, 16వ ఓవర్‌లో 3, 17వ ఓవర్‌లో 4, 18వ ఓవర్‌లో 6 సింగిల్స్, 19వ ఓవర్‌లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. అయినా చివరి ఓవర్‌లో 12 పరుగుల కొడితే మ్యాచ్ అయిపోయేది. అయితే ఆఖరి ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగులు మాత్రమే చేసింది...

58
Image credit: PTI

ఓపెనర్‌గా వచ్చి ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్, 61 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో మెయిడిన్ ఓవర్‌ ఆడితే కలిసి వచ్చిందని అనుకున్నాడో ఏమీ ఈ మ్యాచ్‌లో కూడా మెడియిన్‌ ఓవర్‌తోనే మొదలెట్టాడు కెఎల్ రాహుల్...
 

68

‘35 బంతుల్లో 30 పరుగులు కావాలి, అది చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. అయినా కూడా ఛేదించలేక చతికిలపడాలంటే చాలా చెత్త బ్యాటింగ్ ఉండాలి. అయినా కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఇది కొత్తేమీ కాదు. 2020 పంజాబ్ కింగ్స్‌లోనూ ఇలాంటి ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోవడం చూశాం....

78
Image credit: PTI

గుజరాత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. హార్ధిక్ పాండ్యా స్మార్ట్ కెప్టెన్సీ చేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా కెఎల్ రాహుల్ బుర్రతక్కువ కెప్టెన్సీ, బ్యాటింగే లక్నో ఓటమికి కారణం...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్...

88

2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 4 పరుగులు చేయలేక ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. అలా రాహుల్ కెప్టెన్సీలో 2 సీజన్లలో కలిపి ఈజీగా గెలవాల్సిన దాదాపు అరడజను మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ చతికిల పడింది. రాహుల్‌తో పాటు అప్పుడు పంజాబ్‌లో ఉన్న నికోలస్ పూరన్, రవి భిష్ణోయ్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లోనే ఉన్నారు..

click me!

Recommended Stories