దిగ్గజ బౌలర్లకు నిద్రలేకుండా చేసిన సచిన్‌ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా..?

Published : Apr 23, 2023, 03:42 PM IST

Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్  వల్ల  అంతర్జాతీయ క్రికెట్ లో  దిగ్గజ బౌలర్లు సైతం  నిద్రలేని రాత్రులను గడిపారు. కానీ సచిన్ ను ఇబ్బందిపెట్టిన బౌలర్ ఎవరంటే..!

PREV
16
దిగ్గజ బౌలర్లకు నిద్రలేకుండా చేసిన సచిన్‌ను భయపెట్టిన  బౌలర్ ఎవరో తెలుసా..?

పాతికేండ్ల పాటు    భారత క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియగా  ఉన్న సచిన్ టెండూల్కర్   ఏప్రిల్ 24న  50వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.  తన కెరీర్ లో  సచిన్ ఎంతోమంది దిగ్గజ బౌలర్లను  ధీటుగా ఎదుర్కున్నాడు. 90వ దశకంలో అంతర్జాతీయ క్రికెట్ లో దిగ్గజ బౌలర్లు గా వెలుగొందిన  పేసర్లు  వసీం  అక్రమ్,  వకార్ యూనిస్,  గ్లెన్ మెక్‌గ్రాత్, జేసన్ గిలెస్పీ,  చమిందా వాస్,  షాన్ పొలాక్, అలెన్ డొనాల్డ్,  షోయభ్ అక్తర్,  కోట్నీ వాల్ష్   వంటివారిని  సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. 

26

అదే కాలంలో ఆడిన స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్,  సక్లయిన్ ముస్తాక్  ల బౌలింగ్ లో టన్నుల కొద్దీ  పరుగులు చేశాడు. తన బౌలింగ్ ను చితకబాదినప్పుడు  ఓ సందర్భంలో షేన్ వార్న్ అయితే  ‘సచిన్ నా కలలోకి కూడా వస్తున్నాడు’అని బహిరంగంగానే చెప్పాడు.   అంతేగాక పైన పేర్కొన్న వారి బౌలింగ్ లో  చాలాసార్లు  సచిన్  ఔటయ్యాడు. 

36

అయితే ఇంతమంది దిగ్గజ బౌలర్లను అలవకోగా ఎదుర్కున్న  సచిన్ ను ఓ బౌలర్ భయపెట్టాడట. అతడెవరో కాదు.. సౌతాఫ్రికా మాజీ సారథి హ్యాన్సీ క్రానే.  సౌతాఫ్రికా టూర్ కు వెళ్తే  షాన్ పొలాక్, అలెన్ డొనాల్డ్  వంటి బౌలర్లను అలవోకగా ఆడిన తాను  క్రానే బౌలింగ్  కు వచ్చేసరికి భయపడేవాడినని గతంలో పలుమార్లు చెప్పాడు. 

46

తన బయోపిక్ ‘సచిన్’  సినిమా   ప్రమోషన్ ఈవెంట్ తో పాటు గతంలో ‘గార్డియన్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో   మాస్టర్ బ్లాస్టర్ మాట్లాడుతూ.. ‘వాస్తవంగా చెప్పాలంటే  హ్యాన్సీ క్రానే. సౌతాఫ్రికాకు ఆడేందుకు వెళ్లిన ప్రతీసారి నన్ను పొలాక్,  డొనాల్డ్ కంటే ఎక్కువసార్లు ఔట్ చేసేవాడు.  

56

నేను అతడిని బౌలింగ్ ను ఆడలేక కాదు. హ్యాన్సీ క్రానే బౌలింగ్ లో నేను ఏం చేసినా బంతి బ్యాట్  ను తాకి ఫీల్డర్  చేతుల్లో పడేది. సౌతాఫ్రికా టూర్ లో బాగా ఆడదామని నేను పొలాక్, డొనాల్డ్ బౌలింగ్ ను  దగ్గరగా పరిశీలించి వారిని బాగా ఎదుర్కుందామని వెళ్లేవాన్ని. కానీ వాళ్లు   హ్యాన్సీ క్రానే వచ్చి  నన్ను బోల్తా కొట్టించేవాడు. అసలు అతడి బౌలింగ్ లో ఎలా ఆడాలో నాకు అర్థమయ్యేది కాదు’  అని చెప్పాడు. 

66

సౌతాఫ్రికా తరఫున  68 టెస్టులు,  188 వన్డేలు ఆడిన  క్రానే.. టెస్టులలో  43 వికెట్లు,  వన్డేలలో 114 వికెట్లు తీశాడు.  ఇక సచిన్ ను క్రానే  టెస్టులలో  ఐదు సార్లు.. వన్డేలలో మూడు సార్లు ఔట్ చేశాడు.  

click me!

Recommended Stories