ఇది టీమిండియా కాదు! పాంటింగ్, గంగూలీ... అంతమంది ఉండి ఏం లాభం! ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెహ్వాగ్ ఫైర్...

Published : Apr 16, 2023, 01:38 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి టీమ్‌కి దూరంగా ఉండడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సీజన్‌ని మొదలెట్టిన ఢిల్లీ టీమ్, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలవాల్సిన పరిస్థితి...

PREV
16
ఇది టీమిండియా కాదు! పాంటింగ్, గంగూలీ... అంతమంది ఉండి ఏం లాభం! ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెహ్వాగ్ ఫైర్...

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహాయిస్తే మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పర్ఫామెన్స్ తీవ్రంగా నిరాశపరిచింది. సరిగ్గా చెప్పాలంటే బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్, బౌలింగ్‌లో అన్రీచ్ నోకియా తప్ప మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ సరిగ్గా రాణించడం లేదు...

26

భారీ అంచనాలు పెట్టుకున్న పృథ్వీ షా అట్టర్ ఫ్లాప్ అవుతుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్, రిలే రూసో వంటి ప్లేయర్లు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున గుండు సున్నాలు, అంకెల స్కోరు చుడుతూ అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు...

36
Image credit: Delhi Capitals

‘ఏ టీమ్ ఓడిపోయినా, ఆ ఓటమికి కోచ్‌లకు కూడా క్రెడిట్ దక్కాల్సిందే. వాళ్లు బాధ్యత వహించాల్సిందే. రికీ పాంటింగ్ అద్భుతమైన కెప్టెన్, అద్భుతమైన కోచ్ కూడా. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని ఫైనల్‌కి కూడా తీసుకెళ్లాడు. అతను వచ్చాక ఆ టీమ్ పర్ఫామెన్స్ చాలా మెరుగైంది.
 

46
Image credit: PTI

ఢిల్లీ క్యాపిటల్స్ సక్సెస్‌లో రికీ పాంటింగ్‌కి క్రెడిట్ దక్కినంటే, ఇప్పుడు ఫెయిల్యూర్‌లో కూడా అతనికి క్రెడిట్ దక్కాలి. ఇది టీమిండియా కాదు. టీమిండియాలో అయితే గెలిచినా, ఓడినా కెప్టెన్లకే క్రెడిట్ వెళ్తుంది. ఐపీఎల్‌‌లో మాత్రం ఓడిపోతే ఇద్దరు ముగ్గురు ప్లేయర్లను బలి చేస్తున్నారు..

56

ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ టీమ్‌లో రికీ పాంటింగ్, షేన్ వాట్సన్, సౌరవ్ గంగూలీ వంటి మహామహులు ఉన్నారు. ఒక్క మ్యాచ్ గెలవలేనప్పుడు కోచింగ్‌ టీమ్‌లో ఎంత గొప్పవాళ్లు ఉండి మాత్రం ఏం లాభం. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా ఇదే.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

66

మొదటి 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 9 మ్యాచుల్లో కనీసం 8 మ్యాచులు నెగ్గాల్సి ఉంటుంది. గత సీజన్‌లా కాకుండా ప్లేఆఫ్స్ రేస్ క్లిష్టంగా మారితే 9కి 9 మ్యాచులు గెలవాల్సి రావచ్చు.. 

click me!

Recommended Stories